నెగిటివ్ పాత్రలలో నటించి,శభాష్ అనిపించుకున్న టాలీవుడ్ హీరోయిన్స్ వీళ్ళే..!
•హీరోయిన్ గా కంటే నెగిటివ్ పాత్రలతోనే భారీ గుర్తింపు
•తమను తాము ప్రూవ్ చేసుకున్న హీరోయిన్స్..
టాలీవుడ్ లో ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారు.. భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న సెలబ్రిటీలు కూడా.. ఒక్కోసారి అభిమానులు కూడా ఊహించని నెగిటివ్ పాత్రలలో నటించి అందరికీ షాక్ ఇచ్చారు. అందాల కనువిందు చేయకుండా కుతంత్రపు పాత్రలు చేస్తే ఎలా ఉంటుంది అభిమానులు ఒప్పుకుంటారా.. హీరోయిన్స్ గా చలామణి అవుతున్న భామలతో నెగిటివ్ పాత్రలు వేయించి హిట్ కొట్టిన , ఫ్లాప్ అయినా సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
1). సౌందర్య:
సౌందర్య అంటే సాంప్రదాయానికి పెట్టింది పేరు.. నటనకి ఓనమాలు నేర్పినటువంటి హీరోయిన్. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత కెరియర్ డౌన్ అవుతున్న సమయంలో నా మనసిస్తారా సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించింది. ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది.
2). రమ్యకృష్ణ:
నరసింహ సినిమాలో సౌందర్య పాత్రను మించి డామినేట్ చేసింది రమ్యకృష్ణ.. ఈ చిత్రంలో రమ్యకృష్ణకి ఎక్కువ మార్కులు పడ్డాయి. విలనిజానికి కొత్త అర్థం చెప్పింది రమ్యకృష్ణ.
3). భాను ప్రియ:
తెలుగు సినీ ఇండస్ట్రీలో సున్నితంగా మాట్లాడే హీరోయిన్స్ లో ఈమె ముందు వరసలో ఉంటుంది. కృష్ణ నటించిన గూడచారి 117 సినిమాలో విలన్ గా నటించింది. అయితే ఆ తర్వాత మళ్లీ అలాంటి పాత్రలలో నటించలేదు.
4). రీమాసేన్:
కార్తీ హీరోగా నటించిన యుగానికి ఒక్కడు చిత్రంలో నెగిటివ్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. అలాగే వల్లభ సినిమాలో కూడా నెగిటివ్ పాత్రలోనే నటించి మెప్పించింది.
5). త్రిష:
ధనుష్ నటించిన ధర్మ యోగి చిత్రంలో కూడా త్రిష నెగటివ్ పాత్రలో నటించింది.
6). శ్రియా రెడ్డి:
విశాల్ నటించిన పొగరు సినిమాలో అద్భుతమైన నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మహేష్
7). రాశి:
అధిక బరువు కారణంగా హీరోయిన్ కెరియర్ కి దూరమైన రాశి, మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో విలన్గా నటించి మెప్పించింది.
8). పాయల్ రాజ్ పుత్:
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా నెగిటివ్ రోల్ కి సరికొత్త అర్ధాన్ని తెలిపింది ఈ ముద్దుగుమ్మ .
9). సమంత:
విక్రమ్ నటించిన టెన్ సినిమాలో సమంత నెగటివ్ పాత్రలో నటించింది.