ఇది ఇలా ఉంటే తాజాగా
కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా
కింగ్ సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోకపోవడానికి గల కారణాలను తెలియజేశారు. తాజా ఇంటర్వ్యూలో కోనా
వెంకట్ మాట్లాడుతూ ...
కింగ్ సినిమా మొదటి భాగం బాగానే ఉన్నప్పటికీ రెండవ భాగం వల్లే ఆ
సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. సెకండ్ హాఫ్ కాస్త లెంగ్త్ ఎక్కువ అయిన ఫీలింగ్ జనాలకు వచ్చింది.
అలా సెకండ్ హాఫ్ ఫస్టాఫ్ తో పోలిస్తే స్లో కావడం , అలాగే ముఖ్యంగా
సినిమా సెకండ్ హాఫ్ లో బొట్టు శీను ,
కింగ్ క్యారెక్టర్లు అనవసరమైన కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేశాయి అని వాటి వల్ల ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది అని , అలాగే స్క్రీన్ ప్లే కూడా బాగో లేకపోవడం వల్ల ఈ
మూవీ ఫ్లాప్ అయ్యింది అని కొన
వెంకట్ చెప్పాడు. అలాగే
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ ఈ
మూవీ లో
నాగార్జున , బ్రహ్మానందం మధ్య వచ్చే
కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అని , అలాగే ఈ
మూవీ లోని పాటలు కూడా ఎంతగానో ప్రేక్షకులను అలరించాయి అని
కోన వెంకట్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.