ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోలు ఎక్కువ శాతం పాన్ ఇండియా సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నారు. దానితో పాన్ ఇండియా సినిమా అనగానే భారీ ఎత్తున మూవీలను రూపొందించడంతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానితో పెరిగిన బడ్జెట్ ను రికవరీ చేసుకోవడానికి సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచుతున్నారు. దానితో ఈ మధ్య కాలంలో వచ్చిన స్టార్ హీరోలు నటించిన పాన్ ఇండియా సినిమాలు దాదాపుగా కూడా భారీ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 అనే పాన్ ఇండియా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఇక ఈ మూవీ కి తెలంగాణ రాష్ట్రంలో భారీగా టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ మూవీ కి 250 రూపాయల టికెట్ ధరలను పెంచుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల కానుంది.
ఈ సినిమాను కూడా అత్యంత భారీ బడ్జెట్లో నిర్మించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునే వేసులుబాటు ఈజీ గానే లభించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దేవర స్థాయిలో టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు అవకాశం ఈజీగానే లభించే ఛాన్స్ ఉన్న పుష్ప 2 మూవీ బృందం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 300 రూపాయల టికెట్ ధరలతో ఈ సినిమాను తీసుకురావాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.