మెకానిక్ రాఖీ : అంత రిస్క్ అవసరమా విశ్వక్.. తేడా కొడితే అసలుకే మోసం..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు విశ్వక్సేన్ తాజాగా మెకానిక్ రాఖీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాను నవంబర్ 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి శ్రద్ధ శ్రీనాథ్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... సునీల్ ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే విశ్వక్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నాడు. అలాగే ఈ మూవీ ప్రమోషన్లలో ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన శ్రద్ధ శ్రీనాథ్ , మీనాక్షి చౌదరి కూడా పాల్గొంటూ వస్తున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటికే మేకర్స్ రెండు ట్రైలర్లను విడుదల చేశారు.
 

ఈ మూవీ నుండి ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన రెండో ట్రైలర్స్ కూడా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ట్రైలర్స్ మాదిరిగా ఉండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొనలేదు. ఇలా పెద్ద స్థాయిలో ఈ సినిమాపై అంచనాలు లేని సమయంలో ఈ మూవీ బృందం మరో డేరింగ్ డెసిషన్ ను తీసుకుంది. అదేమిటి అంటే ఈ మూవీ కి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను హైదరాబాదులోని నాలుగు థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ బుకింగ్స్ ను కూడా ఓపెన్ చేసినట్లు ప్రకటించింది. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ కి కనుక మంచి టాక్ వచ్చినట్లు అయితే ఈ మూవీ విడుదల రోజు ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

అదే ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ కు కనక కాస్త నెగటివ్ టాక్ వచ్చింది అంటే ఈ మూవీ విడుదల రోజు కలెక్షన్లు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. దానితో అనవసరంగా విశ్వక్ రిస్క్ చేస్తున్నాడు అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తూ ఉంటే , మెకానిక్ రాఖీ సినిమా బాగుండి ఉంటుంది. అందుకే విశ్వక్ ఇంత డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు అని అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి టాక్ ను తెచ్చుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: