పుష్ప 2 షూటింగ్ ఇంకా అయిపోలేదా...రిలీజ్ వాయిదా ?
కాగా, ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. మొన్న ఆదివారం రోజున ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ కు చేరుకుంటుంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ చేయాలని సుకుమార్ నిర్ణయం తీసుకున్నాడట.
ఈ షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిపించనున్నారు. ఇది మాత్రమే కాకుండా ఒక సాంగ్, నాలుగు రోజుల టాకీ పార్ట్ కూడా పెండింగ్ లో ఉందని ఇండస్ట్రీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే సుకుమార్ పుష్ప 2 సినిమా విడుదలకు ముందు పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడని అంటున్నారు. పుష్ప 1 సినిమా సమయంలో కూడా లాస్ట్ మినిట్ వరకు ఫైనల్ కాపీ రెడీ చేయలేదట.
మరి ఈసారి సుకుమార్ ఏం చేస్తాడు అనేది హాట్ టాపిక్ అవుతుంది. షూటింగ్ పూర్తి కాలేదని రిలీజ్ డేట్ ను మళ్ళీ వాయిదా వేస్తారేమో అంటూ కొంత మంది అంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా... మెగా హీరోలు దీనిపై స్పందించలేదు. ఇక అటు చైన్నెలో పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుందట.