మొన్నేగా బిడ్డ పుట్టింది.. అప్పుడే విడాకులా..? అభిమానులకు అమలాపాల్ బిగ్ షాక్..!

Thota Jaya Madhuri
"అమలాపాల్" అంటే అందరికీ ఎంత ఇష్టం అనే విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . టాలెంటెడ్ హీరోయిన్ . పెళ్లికి ముందే కాదు పెళ్లి తర్వాత కూడా చాలా చాలా బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది.  అందుకే ముద్దుగా ఈమెని డస్కీ  బ్యూటీ అంటూ పిలుచుకుంటూ ఉంటారు.  అయితే అలాంటి అమలాపాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోల్లింగ్ కి గురవుతుంది. దానికి కారణం ఆమె చేసే ఫోటోషూట్స్ . మొదట కొలీవుడ్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ .


ఆ తర్వాత ఆయనకు విడాకులు ఇచ్చింది . కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ తాను డైటింగ్ చేస్తున్న జగత్ దేశాయ్ బాయ్ ఫ్రెండ్ ను ప్రేమించి పెళ్లాడింది . అంతేనా రీసెంట్ గా ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది . ఆమె బేబీ బంప్ తో చేసిన రొమాంటిక్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో ఆమెను ఎలా బూతులు తిట్టేలా చేసిందో అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు అమలాపాల్ ఆయనతో కూడా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఆమెకు దూరంగా ఉంటుందట .


అంతేకాదు కొందరు ఈయనకు కూడా విడాకులు ఇచ్చేస్తుందేమో ..? అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు మాత్రం అప్పుడే విడాకులా..? మొన్నేగా బిడ్డ పుట్టింది .. అందులోనే మోఝు తీరిపోయింది అన్న రేంజ్ లో ఘాటుఘాటుగా ట్రోళ్ చేస్తున్నారు . అసలు నిజంగానే అమలాపాల్ ఆయనకు దూరంగా ఉంటుందా..? ఆయనకు విడాకులు ఇవ్వాలనుకుంటుందా..? ఇది సోషల్ మీడియాలో పుట్టిన గాలివార్తేనా..? తెలియాలి అంటే అమలాపాల్ స్పందించాల్సిందే . అంతవరకు వేచి చూడాల్సిందే అంటున్నారు ఫాన్స్. కోలీవుడ్ ఇండస్ట్రీలో అమలాపాల్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఎటువంటి పాత్రలు అయినా నటించేస్తుంది అన్న పేరు కూడా ఉంది.  అలాంటి అమలాపాల్ ఇప్పుడు ఇలాంటి ఒక చెత్త రూమర్ కారణంగా సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: