ఇంకా ఆ మూడు సినిమాల హవానే.. కొత్త సినిమాల జోష్ లేనేలేదు..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో ఏ మూవీ కి అయితే లాంగ్ రన్ లో కలెక్షన్లు బాగా వస్తాయో ఆ సినిమాలే అద్భుతమైన లాభాలను అందుకునే అవకాశాలు ఉంటాయి. ఏ సినిమాకైనా మొదటి వారం వచ్చే కలెక్షన్ల కంటే రెండవ , మూడవ వారం ఎక్కువ కలెక్షన్లు వస్తాయో ఆ మూవీలు భారీ కలెక్షన్లను అందుకోవడం మాత్రమే కాకుండా నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద మొత్తంలో లాభాలను అందిస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ సంవత్సరం అక్టోబర్ 31 వ తేదీన కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన క , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన లక్కీ భాస్కర్ , శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన తమిళ డబ్బింగ్ సినిమా అమరన్ , కన్నడ డబ్బింగ్ సినిమా భగీర విడుదల అయ్యాయి.

ఇందులో భగీర సినిమాకు ప్లాప్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ఎఫెక్ట్స్ చూపలేకపోయింది. ఇక క , లక్కీ భాస్కర్ , అమరన్ మూవీ లు మాత్రం అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇక ఈ సినిమాలు విడుదల అయిన తరువాత భారీ అంచనాల నడుమ తెలుగు నుండి మట్కా , తమిళ్ నుండి కంగువ సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాల ప్రభావం వల్ల క , లక్కీ భాస్కర్ , అమరన్ సినిమాల కలెక్షన్లు భారీగా పడిపోతాయి అని చాలా మంది భావించారు.

కానీ మట్కా , కంగువ రెండు సినిమాలకు కూడా నెగిటివ్ రావడంతో మూడవ వారం లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా క , లక్కీ భాస్కర్ , అమరన్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. దానితో లాంగ్ రన్ లో ఈ సినిమాలు భారీ కలక్షన్లను వసూలు చేస్తూ ఉండడంతో ఈ మూవీ ల ద్వారా నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: