మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఇంద్ర మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించగా ... మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఇంద్ర సినిమాకు మాటల రచయితగా పని చేసిన పరుచూరి గోపాలకృష్ణ ఈ మూవీ సెట్ కావడానికి ముందు జరిగిన ఇంట్రెస్టింగ్ వివరాలను చెప్పుకొచ్చాడు. పరుచూరి గోపాలకృష్ణ "ఇంద్ర" సినిమా గురించి మాట్లాడుతూ ... చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో అశ్విని దత్ ఓ మూవీ సెట్ చేశాడు.
ఇక చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది. దానిని విని , అది నచ్చితే ఆ కథతో సినిమా చేయండి అని గోపాల్ కి అశ్విని దత్ చెప్పాడు. దానితో గోపాల్ , చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథను విన్నాడు. కానీ ఆ కథ ఆయనకు పెద్దగా నచ్చలేదు. దానితో ఆ స్టోరీ తో సినిమా చేయకూడదు అనుకున్నాడు. ఇక ఒక రోజు ఆయన నాకు కలిశాడు. దానితో నువ్వు ఎందుకు ఆ స్టోరీతో సినిమా చేయకూడదు అనుకుంటున్నావు అని అడిగాను. దానితో ఆయన నేను చిరంజీవి తో కొంత కాలం క్రితం మెకానిక్ అల్లుడు సినిమా చేశాను. ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఇక ఇది వరకే నేను బాలకృష్ణతో సమరసింహారెడ్డి , నరసింహనాయుడు అనే రెండు ప్యాక్షన్ సినిమాలు చేశాను. అవి రెండు హీట్ అయ్యాయి.
చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథ ఆ సినిమాల కథకు దగ్గరగా ఉంది. అలాంటి కథతో సినిమా చేస్తే అది ఫ్లాప్ అయితే చిరంజీవికి నా వల్ల రెండవ ఫ్లాప్ వస్తే నేను తట్టుకోలేను. అందుకే వేరే కథతో సినిమా చేయను అన్నాడు. కానీ నేను మాత్రం బాలకృష్ణతో నువ్వు ఫ్యాక్షన్ సినిమా చేశావు. చిరంజీవితో కాదు. చిరంజీవితో ఆ ఫ్యాక్షన్ కథతో సినిమాను రూపొందిస్తే కచ్చితంగా అది హిట్ అవుతుంది అని చెప్పాను. దానితో ఆయన కూడా కన్విన్స్ అయ్యి చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథలో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కొన్ని మార్పులు , చేర్పులు చేసి ఆ కథను ఇంద్ర అనే టైటిల్ తో రూపొందించాం. అది అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చాడు.