రెహ్మాన్ విడాకుల వెన‌క ఇంత జ‌రిగిందా... త‌ప్పు ఎవ‌రిదంటే..?

RAMAKRISHNA S.S.
భారతదేశంలో గర్వించదగ్గ ప్రముఖ సంగీత దర్శకులలో ఏఆర్ రెహమాన్ ఒకరు. ఆస్కార్ అవార్డు విజేత అయిన ఏఆర్ రెహమాన్ తాజాగా తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు.. సంగీత ప్రేమికులకు ఒకసారి షాక్ ఇచ్చారు. ఏకంగా పెళ్లి చేసుకుని 29 సంవత్సరాలు పాటు కలిసి కాపురం చేశాక.. ఇప్పుడు విడాకులు తీసుకోవడం అంటే ఎవరికి నచ్చటం లేదు. వచ్చే ఏడాది 30 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్న తరుణంలో ఈ దంపతులు ఇలా విడిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. 1995లో పెళ్లి చేసుకున్న ఈ జంట ముగ్గురు పిల్లలు పుట్టి.. అందులోను పెద్ద కుమార్తెకు వివాహం చేశాక 29 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడం వెనక కారణాలు ఏమై ఉంటాయో అన్న పణంలో రకరకాల సందేహాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోని కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటకు వచ్చాయి. అసలు ఈ విడాకులు ఆలోచనకు రెహమాన్ భార్య సైరా భాను ఏ కారణం అని తెలుస్తోంది. రెహమాన్ గత కొన్ని యేళ్లుగా తన ఫ్యామిలీకి సమయం కేటాయించకుండా ఎక్కువగా టైం సినిమా పనులపైన దృష్టి పెట్టడం సైరా భానుకు ఏ మాత్రం నచ్చలేదట. వీరి మధ్య తరచూ ఈ విషయంపై గొడవలు జరిగేవట. ఇటీవల కాలంలో రెహమాన్ కు సినిమా అవకాశాలు ఎక్కువయ్యాయి. దీంతో ఆయన ఇంట్లో కంటే స్టూడియోలోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఇటీవల వీరి మధ్య పెద్ద గొడవే జరిగిందని. ఆ గొడవే వీరు విడాకులకు ప్రధాన కారణంగా మారింది అంటున్నారు. గొడవ అనంతరం ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని.. దీనిపై ముందుగా కూతుర్లు.. కొడుకులతో సంప్రదింపులు జరిపిన తర్వాత విడాకులు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తమిళ‌ మీడియా వర్గాల్లో కథనాలు వస్తున్నాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ తన భార్య గురించి మాట్లాడుతూ రంగీలా - బాంబే లాంటి సినిమాలు చేస్తున్న సమయంలో చాలా బిజీగా ఉన్నానని ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని .. అప్పుడు నా వయసు 29 ఏళ్లు అని పెళ్లికూతురుని వెతికి పెట్టండి అని తన తల్లికి అప్పుడే చేకపోయినట్టు రెహమాన్ ఇంటర్వ్యూలో చెప్పారు. నా భార్య చాలా సింపుల్ గా ఉండాలని.. తన కెరీర్ కు ట్రబుల్ రావద్దు అని ఆశించానని.. అప్పుడే మ్యూజిక్ పై దృష్టి పెడతానని అనుకున్నానని కూడా రెహమాన్ నాటి ఇంటర్వ్యూలో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: