ఆల్ టైం దారుణమైన చెత్త రికార్డ్ క్రియేట్ చేసిన ' మట్కా ' ... పాపం వరుణ్ తేజ్..!
అయితే మొదటి రోజు నుంచే ఘోరమైన డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అసలు ప్రేక్షకులు ఎవరు ? థియేటర్లకు రాలేదు. ఇంకా చెప్పాలి అంటే తొలిరోజే మార్నింగ్ షో లు చాలా వరకు క్యాన్సిల్ అయ్యాయి. ఈ సినిమాకు రు. 18 కోట్ల నష్టం వచ్చింది. ప్రమోషన్ల కోసమే ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాత కూడా బాగా నమ్మకంతో ఉన్న నిరాశ తప్పలేదు. నైజాం లో కేవలం రు. 47 లక్షల షేర్ రాగా ... ఏపీలో రు. 67 లక్షలు .. ఇతర ప్రాంతాల్లో 15 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది. చిన్న చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్ల రాబడుతున్న టైంలో వరుణ్ తేజ్ సినిమాలు మాత్రం ఎందుకు ? ఇలా డిజాస్టర్లు అవుతున్నాయో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికైనా కథల ఎంపికలో వరుణ్ తేజ్ జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఇక మట్కా సినిమా విడుదలైన 5వ రోజు ఘోరమైన చెత్త రికార్డు నమోదు చేసింది. ఐదవ రోజు సున్నా షేర్ దక్కించుకొని అతి చెత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఐదు రోజులకు కలిపి కేవలం రు. 1.30 కోట్లు మాత్రమే వచ్చాయి. తన కెరీర్ లో గద్దలకొండ గణేష్, ఎఫ్2, ఎఫ్3, ఫిదా, తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ సినిమాలున్నాయి. మరి ఇప్పటికి అయినా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి.