చాలా దారుణంగా.. పచ్చి బూతులతో టాలీవుడ్ స్టార్ హీరోలపై...!
సినిమాలో స్టార్ హీరోలు అందరికీ భారీ స్థాయిలో అభిమానులు ఉంటారు.. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు చూపించే అభిమానం మాత్రం ఒక్కసారి వెర్రి తలలు వేస్తుంది. ఇంట్లో అమ్మానాన్నల కంటే అభిమాన హీరోలు అంటేనే ప్రాణం ఇస్తామంటారు. అలాంటి అభిమానులు టాలీవుడ్లో అందరూ స్టార్ హీరోలకు ఉన్నారు. తాజాగా ఒక హీరో అభిమానులకు .. మరో హీరో అభిమానులకు గొడవలు .. రికార్డులు .. కలెక్షన్లు వంటి వాటిలో సోషల్ మీడియా వేదికగా యుద్ధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధాలు ఫేస్బుక్ పేజీలతో పాటు సోషల్ మీడియా ఖాతాలు .. ఎక్స్ ఖాతాలలో భారీ ఎత్తున ట్రెండింగ్ అవుతున్నాయి. అభిమానులకు నెగిటివ్ కామెంట్లు కూడా తప్పటం లేదు. ఫేస్బుక్లో ఆ ఎరా ముగిసిపోయాక ఆ బ్యాచ్ తర్వాత ఇప్పుడు చాలామంది ఎక్స్ లోకి వచ్చారు.
టాలీవుడ్ హీరోల అభిమానులు అప్పుడు ఫేస్బుక్లో చేసే యుద్ధాలు .. ఇప్పుడు ఎక్స్ లో చేయడం మొదలుపెట్టారు. ఇది ఇప్పుడు ఎంత దారుణంగా మారుతుంది అంటే అక్కడ కోపాలు .. ఆయా హీరోలపై దారుణంగా విషం కక్కేలా చేస్తున్నాయి. ఏది ఏమైనా ప్రతి విమర్శకి ఒక హద్దు ఉండాలి. ఇప్పుడు ఈ కామెంట్లు ఏ రేంజ్ కి ? వెళ్ళాయంటే డైరెక్టర్ గా థియేటర్ల దగ్గర దారుణమైన ఫ్లెక్సీలు .. ఇతర హీరోలను కించ పరుస్తూ మన తెలుగు హీరోల పరువును ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా మనమే తీసుకుంటున్న పరిస్థితులు వచ్చేశాయి. ఒకపక్క తెలుగు సినిమాను మన హీరోలు వరల్డ్ స్థాయికి తీసుకు వెళుతుంటే ... ఆ హీరోల అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో యుద్ధాలు చేసుకుంటూ పచ్చి బూతులతో హీరోలను తిట్టుకుంటూ మన తెలుగు సినిమా పరుగును బజారుకి ఈడుస్తున్నారు.