నాగచైతన్యకు ఆ విషయం చెప్పకుండా శోభిత ఛీటింగ్‌?

Veldandi Saikiran
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల గత కొన్ని రోజుల నుంచి సీక్రెట్ గా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ చాలా సందర్భాల్లో బయట కనిపించారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో రకాల రూమర్స్ వచ్చినప్పటికీ ఆ వార్తలపై నాగచైతన్య కానీ, శోభిత కానీ స్పందించలేదు. చాలా సీక్రెట్ గా వారి రిలేషన్ కొనసాగించారు. కొన్ని సంవత్సరాల తర్వాత మీ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని కుటుంబ సభ్యులను ఒప్పించి ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు.

వచ్చే నెల డిసెంబర్ లో వీరి వివాహం జరగనుందని టాక్ వినిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8.13 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారని సమాచారం అందుతోంది. చైతన్య, శోభిత వివాహాన్ని బయటి దేశాలలో జరిపించాలని నాగార్జున అనుకున్నప్పటికీ నాగచైతన్య అసలు ఒప్పుకోలేదట. దీంతో చేసేదేమీ లేక నాగార్జుననే నాగచైతన్య, శోభిత వివాహాన్ని అన్నపూర్ణ స్టూడియోలోనే ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారట.

ఇక వివాహానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉండడంతో ఇప్పటికే అన్ని పనులను దగ్గరుండి మరీ చూసుకుంటున్నారట నాగార్జున. ఇకపోతే ఇప్పటివరకు మనకు శోభితగా మాత్రమే తెలిసిన ఈమె అసలు పేరు శోభిత కాదని తాజాగా వెలుగులోకి వచ్చింది. తన పూర్తి పేరు లక్ష్మి శోబిత అనే విషయం వీరి వివాహం సందర్భంగా బయటపడింది. అయితే లక్ష్మి అనే పేరు కాస్త పాతగా ఉంటుందని కేవలం శోభితగా మాత్రమే ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

ఇకపోతే వీరి వివాహం కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా నాగచైతన్య ప్రస్తుతం "తండేల్" సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7, 2025 లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక తండేల్ సినిమా ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: