పెళ్లంటే నూరేళ్లపంట అని దీవిస్తారు.. కానీ సినీ నటుల విషయంలో మాత్రం పెళ్లి అనేది ఒక రాలిపోతున్న పండుటాకుల తయారైంది.. పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కని, వారు పెరిగి పెద్దయిన తర్వాత చాలామంది సినీ జంటలు విడాకుల బాట పడుతున్నారు.. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధనుష్ ఐశ్వర్య.. ఇక వీరి తర్వాత మరో సెన్సేషనల్ జంట విడాకులు తీసుకుంది. ఇంతకీ వీరు ఎవరయ్యా అంటే ఏఆర్ రెహమాన్ దంపతులు.. అవును మీరు విన్నది నిజమే.. వారి 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పారు.. విడాకులు తీసుకొని దూరం దూరంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించారు.. మరి 29 ఏళ్ల పాటు ఎంతో కలిసి కాపురం చేసిన వీరి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు..విడాకుల తర్వాత ఏఆర్ రెహమాన్ మరో అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోబోతున్నారట.. ఆ వివరాలు ఏంటో చూద్దామా..
ఏఆర్ రెహమాన్ ఇండియా మొత్తంలోని మ్యూజిక్ డైరెక్టర్లలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్.. అసలు మ్యూజిక్ కు కూడా ఆస్కార్ అవార్డు వస్తుందా అని ఆలోచించే సమయంలో మ్యూజిక్ తోనే ఆస్కార్ అవార్డు పొందినటువంటి మొదటి సంగీత దర్శకుడు.. అలా ఇండియా మొత్తంలో ఎంతో పేరుగాంచిన రెహమాన్ 1995లో సైరాబానును వివాహం చేసుకున్నారు. త్వరలో వీరు 30 సంవత్సరాల వివాహ బంధాన్ని పూర్తి చేసుకోబోతున్న తరుణంలో విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.. అయితే రెహమాన్ విడాకులకు ప్రధాన కారణం ఆయన అసిస్టెంట్ అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అది ఎలాగయ్యా అంటే మోహిని డే అనే మహిళ రెహమాన్ వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తుంది..
అయితే రెహమాన్ దంపతులు ఎప్పుడైతే విడాకుల విషయంలో బయటకు వచ్చారో, మోహిని డే కూడా తన భర్తకు విడాకులు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది. ఇలా ఇద్దరు ఒకేసారి విడాకుల బాట పట్టడంతో ఇద్దరు అనుకొని విడాకులు ఇచ్చి ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింటా ఒక వార్త చక్కర్లు కొడుతోంది.. మరిచూడాలి నెటిజన్స్ ఊహించింది నిజం అవుతుందా.. లేదంటే సైలెంట్ గా ఉంటుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.