గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్
ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ
సినిమా కోసం ఫ్యాన్స్ గత మూడేళ్ళుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తమిళ్ స్టార్
డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.టాలీవుడ్ స్టార్
ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ
సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసారు.కానీ దర్శకుడు శంకర్ భారతీయుడు 2
సినిమా షూటింగ్ లో బిజీ గా వుండి
సినిమా షూటింగ్ అంతకంతకు వాయిదా వేస్తూ వచ్చారు.దీనితో రాంచరణ్ ఫ్యాన్స్ అప్డేట్స్ అడిగి అడిగి విసిగిపోయారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన
బాలీవుడ్ హాట్
బ్యూటీ కియారా అద్వానీ
హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో ఎస్.జె.సూర్య ,శ్రీకాంత్ ,సునీల్ ,నవీన్ చంద్ర కీలక పాత్రలలో నటించారు.ఈ సినిమాలో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో నటించాడు.ఈ సినిమాలో క్యూట్
బ్యూటీ అంజలి కూడా ముఖ్య పాత్రలో నటించింది.
శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2
సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఫ్యాన్స్ “గేమ్ ఛేంజర్” ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ
సినిమా టీజర్ ని మేకర్స్ గ్రాండ్ గా
రిలీజ్ చేసారు.టీజర్ లో రాంచరణ్ లుక్స్ ,గ్రాండ్ విజువల్స్ ,థమన్ బిజిఎం ,కియారా గ్లామర్ అంతా బాగానే వుంది.”గేమ్ ఛేంజర్” పై ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని ఈ
సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం అని మేకర్స్ ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చారు.అయితే
సినిమా రిలీజ్ కి ఎంతో సమయం లేదు.ఈ టైం లో కూడా దర్శకుడు శంకర్ రీ షూట్స్ పేరిట కాలయాపన చేస్తున్నారు.రీ షూట్స్ మూలంగా మరో వంద కోట్లు స్వాహా చేస్తున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ముందునుంచి అంచనాలు తగ్గుతూ వస్తున్న సినిమాను అమాంతం లేపాలంటే మేకర్స్
కి కత్తి మీద సాము అనే చెప్పాలి.సినిమాపై బజ్ క్రియేట్ చేయడం.అలాగే సినిమాపై ప్రేక్షకులలో అనుమానాలకు క్లారిటీ ఇవ్వడం వంటివి
గేమ్ ఛేంజర్ ముందు వున్న అతి పెద్ద టార్గెట్స్..
.