జబర్దస్త్
కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో
రాకింగ్ రాకేష్ ఒకరు. ఈయనకి
జబర్దస్త్ షో లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా గుర్తింపు లేదు. కానీ
జబర్దస్త్ షో లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తక్కువ కాలం లోనే ఈయన తన అద్భుతమైన
కామెడీ టైమింగ్ తో ఎన్నో అద్భుతమైన స్కిట్ లను చేసి బుల్లి తెర అభిమానులను చాలా మందినే సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇన్ని రోజుల పాటు బుల్లి తెరపై ఫుల్
జోష్ ను కెరియర్ను ముందుకు సాగించిన ఈయన తాజాగా కెసిఆర్ (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో
హీరో గా నటించాడు.
ఈ సినిమాలో ఈయన హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ
మూవీ ని ఈయన స్వయంగా నిర్మించాడు. ఈ
మూవీ ని రేపు అనగా
నవంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ ని ప్రమోట్ చేయడానికి డబ్బులు లేకనో మరే కారణంగానో తెలియదు కానీ నిన్న అర్ధరాత్రి
రాకింగ్ రాకేష్ తన
సినిమా పోస్టర్లను అంటిస్తున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరి రాకేష్ ఈ
సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడు అనేది అర్ధరాత్రి ఆయన పోస్టర్లను అతికించడం ద్వారానే అర్థం అవుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఇక ఈ
మూవీ ఫ్రీ రిలీజ్
ఈవెంట్ హరీష్ రావు ,
రోజా ,
జానీ మాస్టర్ , హైపర్
ఆది పలువురు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. మరి ఈ సినిమాతో
రాకింగ్ రాకేష్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.