రోబో కోసం మొదట అనుకున్న హీరో.. హీరోయిన్ ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రోబో అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా భారీ కలెక్షన్లను కూడా వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా కోసం మొదట శంకర్ ... రజనీ కాంత్ , ఐశ్వర్య రాయ్ నీ కాకుండా వేరే హీరో , హీరోయిన్ అను అనుకున్నాడట. వారితో సినిమా చేయాలి అని కమిట్ కూడా అయ్యాడట. కానీ కొన్ని కారణాలవల్ల అది మిస్ అయ్యిందట. మరి శంకర్ మొదట రోబో సినిమా కోసం అనుకున్న హీరో , హీరోయిన్ ఎవరు .? ఎందుకు అది క్యాన్సల్ అయింది అనే వివరాలను తెలుసుకుందాం.
శంకర్ "రోబో" సినిమా కథ మొత్తం పూర్తి అయిన తర్వాత హీరో పాత్రలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ను తీసుకోవాలి అనుకున్నాడట. ఆయనకు కథను వివరించాడట. ఆయనకు కూడా కథ బాగా నచ్చడంతో సినిమా చేస్తాను అని అన్నాడట. ఇక ఆ తర్వాత హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న ప్రియాంక చోప్రా ను తీసుకోవాలి అనుకున్నారట. ఆమెకు కూడా కథను వివరించగా ఆమె కూడా ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక ఇలా హీరో , హీరోయిన్ పాత్రలకి నటీనటులు ఒకే కావడంతో శంకర్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించాడట. ఇక అలా అన్ని పనులు వేగవంతంగా జరుగుతున్న సమయంలో ప్రియాంక ఇతర సినిమాలకు కమిట్ కావడంతో శంకర్ ఇప్పట్లో వీరితో సినిమా కుదరదు అనే ఉద్దేశంతో రజనీ కాంత్ , ఐశ్వర్య రాయ్ హీరో , హీరోయిన్లుగా ఈ సినిమాను చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే రోబో సినిమా రజినీ కాంత్ , ఐశ్వర్య రాయ్ , శంకర్ కెరియర్లో అద్భుతమైన విజయవంతమైన సినిమాగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: