ఎ.ఆర్. రెహమాన్ పేరు మార్చుకోవడం వెనుక ఇంత సీక్రెట్ ఉందా.. !
భారతదేశ మాత్రమే కాదు ప్రపంచం అంతా మెచ్చిన గొప్ప సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ భారతీయుడుగా పుట్టటం మనందరికీ గర్వకారణం. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మీడియాలోను.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారారు. ఆయన తన భార్య సైరాబానుతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రెహమాన్ బాగా వైరల్ అవుతున్నారు. వీరిద్దరూ దాదాపు 30 సంవత్సరాల పాటు పెళ్లి చేసుకుని కలిసి కాపురం చేసుకున్న తర్వాత విడిపోతున్నట్టు ప్రకటించి దేశవ్యాప్తంగా ఉన్న సినీ వర్గాలకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. 29 ఏళ్లుగా కలిసి ఉన్న ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరి న్యాయవాది వందన్ షా విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా వీరు విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే వందన్ ప్రకటన ప్రకారం విడాకులు ఆర్థిక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు.
రెహమాన్ తండ్రి మరణం తర్వాత ఇస్లాం మతంలోకి మారారు. ఆయన అసలు పేరు దిలీప్ కుమార్. తన పేరు మార్చుకోవాలని చాలాకాలంగా కోరుకున్నారు. రెహమాన్ అనే పేరుతో తనకు చాలా దగ్గర అనుబంధం ఉంది అని ఆయన భావించేవారు. అందుకే తండ్రి మరణం తర్వాత కుటుంబంతో కలిసి ఇస్లా మతంలోకి మారడంతో చాలాకాలంగా తాను కోరుకున్న రెహమాన్ అనే పేరును ఉపయోగించుకున్నారు. తన చెల్లి పెళ్లికి జాతకం చూడటానికి వెళ్ళినప్పుడు ఒక హిందూ జ్యోతిష్యుడు అబ్దుర్ రెహమాన్ - అబ్దుల్ రెహమాన్ అనే పేరు సూచించారని రెహమాన్ గుర్తు చేసుకున్నారు. అందులో రెహమాన్ అనే పేరును దిలీప్ కుమార్ ఎంచుకున్నారు.
అలా తన తల్లి కోరిక మేరకు అల్లా రక్కా అనే పదం కూడా జోడించి ఏఆర్ రెహమాన్ గా పేరు మార్చుకున్నారు.. అంటే దేవునిచే కాపాడబ డ్డ వాడు అని అర్థం వస్తుంది. ఏది ఏమైనా రెహమాన్ పేరు నేడు సంగీత ప్రపంచంలో ఒక వెలుగు వెలిగింది. సంగీత ప్రియులను మదిని దోచి ఒక ఊపు ఊపి వదిలిపెట్టింది. ఈ పేరు మార్పు రెహమాన్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలుపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఉన్న కీర్తన సూచిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ సంగీత కళాకారులలో ఒకరిగా ఆయన స్థానాన్ని ప్రదిల పరుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.