ఆ పద్యాన్ని షేర్ చేసిన సమంత.. ఆ కామెంట్స్ గురించి స్పందించారా?

Reddy P Rajasekhar
స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన ప్రతి కీలక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడానికి సమంత ఎంతగానో ఇష్టపడతారు. తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా తనకు ఇష్టమైన పద్యాన్ని పంచుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. లైఫ్ లో ఎన్ని సవాళ్లు ఎదురైనా ఈ పద్యం తనలో స్పూర్తి నింపుతుందని ఆమె తెలిపారు.
 
మిమ్మల్ని అందరూ నిందిస్తున్న సమయంలో మీరు తలెత్తుకుని నిలబడితే పురుషులందరూ మిమ్మల్ని అవమానించినప్పుడు మిమ్మల్ని మీరు నమ్మితే అనే పద్యాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ పద్యాన్ని మీ అందరితో పంచుకోవాలని ఉందని ఆమె క్యాప్షన్ పెట్టారు. విజయాలన్నీ పక్కన పెట్టి ఒక్కసారి రిస్క్ చేసిన సమయంలో అక్కడ ఓడిపోతే మళ్లీ కొత్తగా ప్రయత్నాన్ని మొదలుపెట్టాలని సమంత అన్నారు.
 
ఆ ఓటమి గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదని మన హృదయాన్ని మరింత కఠినంగా మార్చుకుని సుదీర్ఘ ప్రయాణం కోసం ధైర్యంగా ముందుకు కదలాలని ఆమె చెప్పుకొచ్చారు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు సంకల్పం అనే దాన్ని గట్టిగా పట్టుకోవాలని అప్పుడు మనల్ని నిందించే వారికి సరైన సమాధానం చెప్పవచ్చని సమంత పేర్కొన్నారు.
 
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ రావాల్సి ఉంది. సమంత పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉంది. సమంత తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సమంత కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తే ఆమె ఖాతాలో మరిన్ని విజయాలు చేరతాయని చెప్పవచ్చు. సిటాడెల్ ఫ్లాప్ గురించి ఆమె ఈ విధంగా స్పందించారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: