పెళ్లి వయసుకు కూతురు...అంతలోనే తల్లి ప్రెగ్నెంట్..!
అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, అనగనగా ఓ కుర్రాడు, ఓం నమో వెంకటేశాయ వంటి ఎన్నెన్నో ఇతర చిత్రాలలో ఆమె పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ ఎన్నో చిత్రాలలో తన మధురమైన గొంతుతో పాటలు పాడి ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే సునీత ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం వల్ల సునీత ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొంది.
కోట్లాది రూపాయలు ఉన్నాయి కాబట్టే సునీత రామ్ వీరపనేని రెండో వివాహం చేసుకున్నారంటూ దారుణంగా విమర్శించారు. కాగా, సింగర్ సునీత ప్రెగ్నెంట్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.దీంతో నెటిజెన్లు తమ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. 45 ఏళ్ల వయసులో సింగర్ సునీత ప్రెగ్నెంట్ అవడం ఏంటి అంటూ దారుణంగా వార్తలు వైరల్ చేస్తున్నారు. తన కూతురికి పెళ్లి చేయాల్సిన వయసులో తల్లి కాబోతుందంటూ ఆమెపై విమర్శలు గుప్పించారు.
అయితే ఈ వార్తలపై సునీత నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా, గతంలో కూడా సింగర్ సునీతపై ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. ఆమె ఏవో కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో సునీత ప్రెగ్నెంట్ అయిందంటూ దారుణంగా టోల్స్ చేశారు. ఇక మళ్లీ చాలా రోజులకి ఇలాంటి వార్తలని ముందుకు తీసుకు వస్తున్నారు. ఇక ఈ వార్తలపై సింగర్ సునీత ఎలా స్పందిస్తుందో చూడాలి.