టాలీవుడ్ పెయిడ్ ప్రీమియ‌ర్ల గుట్టు ర‌ట్టు...?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
ఇటీవల కాలంలో తెలుగు సినిమాకు పట్టిన పిచ్చి లేదా అలవాటు చేసుకున్న ఫ్యాషన్ పెయిడ్‌ ప్రీమియర్లు. అంటే విడుదలకు ముందు రోజే నాలుగైదు పెద్ద పట్టణాల్లో రాత్రి 7 గంటలకు ఒక్కో షో వేసి టిక్కెట్లు అమ్మటం .. ఒకవేళ టికెట్ల బుకింగ్ రెస్పాన్స్ బాగుంటే మరో షో ప్లాన్ చేస్తున్నారు. మంచి కాంబినేషన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినిమాలకు ప్రీమియర్లు వర్క్ అవుట్ అవుతాయి. అది కూడా సినిమా మీద పూర్తి నమ్మకం ఉంటే సినిమా ఖచ్చితంగా ఫుల్ ప్రూఫ్ గా ఉందని నమ్మితేనే ప్రీమియర్లు వేయాలి .. అలా కాకుండా వేలం వెర్రి గా ప్రతి సినిమా ప్రీమియర్లు వేసుకుంటే పోతే నష్టమే తప్ప లాభం ఉండదు. అన్ని సినిమాల ప్రీమియర్లకు టికెట్లు తెగవు. తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవాలి తప్ప మరో మార్గం ఉండదు.

పోనీ అలా ఇచ్చిన ఫలితం ఉంటుందంటే అది ఉండదు సినిమా ఎలా ఉంది ? అన్నది బయటికి వచ్చేస్తుంది. ఫోన్లో .. వాట్సాప్ లో .. ట్విట్టర్లు ఇలా రకరకాలుగా మరుసటి రోజు ఉదయం రావాల్సిన ఓపెనింగ్ మీద గట్టి ప్రభావం పడుతుంది. ఎంత ప్రచారం చేసిన కంటెంట్ బానే ఉండేలా ఉంది అనే నమ్మకం కలిగినా కూడా మార్నింగ్ షోల్కు టికెట్లు తేగటం లేదు. అలాంటిది ప్రీమియర్లు వేసి టాక్ బయటకు వెళ్లిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటి ? హీరోలకు సరదా ఉండొచ్చు తన స్నేహితులు బంధువులకు సినిమా ముందే చూపించాలన్న ఆత్రుత ఉండొచ్చు .. కానీ నిర్మాతలు పెయిడ్‌ ప్రీమియర్ల విషయంలో ఆలోచించుకోవాలన్న చర్చలు టాలీవుడ్ ఇన్న‌ర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. మ‌రి ఇలాంటి షో ల విష‌యంలో ఇక‌పై అయినా ఇండ‌స్ట్రీ జ‌నాలు ప్ర‌త్యేక ఆలోచ‌న చేస్తారేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: