టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా చిరుత సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా ద్వారా నటుడిగా , డాన్సర్ గా చరణ్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మగధీర సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను అందుకొని తన స్టామినా ఏమిటో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరూపించుకున్నాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం రామ్ చరణ్ "రంగస్థలం" అనే సినిమాలో హీరోగా నటించాడు.
ఆ సినిమా కంటే ముందు నటన విషయంలో చరణ్ , చిరంజీవి స్థాయిని అందుకోవడం కష్టం అని విమర్శలు కొన్ని వచ్చినప్పటికీ రంగస్థలం సినిమాలో తన అద్భుతమైన నటనతో విమర్శకులు చేసిన వారితోనే ప్రశంసలను అందుకున్నాడు. చరణ్ కొంత కాలం క్రితం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి 1200 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. దానితో చరణ్ కి గ్లోబల్ గా క్రేజ్ వచ్చింది. ఇక ప్రస్తుతం చరణ్ "గేమ్ చేంజర్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ మూవీ వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమాలోనూ , సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలోనూ సినిమాలు చేయడానికి చరణ్ రెడీగా ఉన్నాడు. ఇది ఇలా ఉంటే చరణ్ విద్యాభ్యాసం విషయానికి వస్తే ... చరణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి వరకు చదివాడు. అదే స్కూల్లో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న దగ్గుపాటి రానా , శర్వానంద్ కూడా విద్యాభ్యాసం చేశారు. చరణ్ , రానా , శర్వానంద్ ముగ్గురు కూడా మంచి స్నేహితులు. ఇక ఆ తర్వాత చరణ్ తన డిగ్రీ చదువును లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేశాడు.