పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ హోల్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.ఇదిలావుండగా ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యాం, ఆదిపురుష్,కల్కి వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటించాడు. ఇప్పుడు ప్రభాస్ రాజసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ క్రమంలో ప్రభాస్‌కు సంబంధించిన అనేక అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రెబల్ స్టార్ ఏం చదువుకున్నాడు అని అంతా సెర్చ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో1974లో వచ్చినటువంటి కృష్ణవేణి, 2009లో వచ్చినటువంటి బిల్లా చిత్రాలను నిర్మించిన ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాత ఉప్పలపాటి సూర్య నారాయణ రాజుగారి కుమారుడు ప్రభాస్. దీంతో ఈ మిర్చి నటుడికి సినిమాతో ఎప్పటి నుంచో అనుబంధం ఉందని తెలిస్తే షాక్ అవ్వరు. అయినప్పటికీ, నటుడు కావాలనే అతని కలలు అతని చదువుకు ఏమాత్రం ఆటంకం కలిగించలేదు.
ఇదిలావుండగా ప్రభాస్ తన ప్రాథమిక పాఠశాల విద్యను భీమవరంలో ఉన్న DNR పాఠశాలలో చేసాడు. ఆ తర్వాత నలంద కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాడు. పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో బి.టెక్ పట్టా ద్వారా పట్టభద్రుడయ్యాడు.ఆ తర్వాత టాలీవుడ్‌లో అడుగు పెట్టకముందే విశాఖపట్నంలోని సత్యానంద్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నటనను అభ్యసించారు.ఈ క్రమంలో తన ఎడ్యుకేషన్ తరువాత ప్రభాస్ 2002లో 'ఈశ్వర్' సినిమాతో నటుడిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన సంగతి తెలిసిందే.ఇదిలావుండగా సలార్, కల్కి 2898 ఏడీ చిత్ర విజయాలతో జోరు మీదున్న ప్రభాస్ ఫౌజీతో పాటు మరిన్ని సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే రాజాసాబ్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంకా స్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్, సలార్ 2 వంటి సినిమాలు కూడా చేయనున్నారు. అలానే కేజీయఫ్, కాంతార, సలార్ చిత్రాలను నిర్మించిన సంస్థ హోంబలే ఫిల్మ్స్ కూడా ప్రభాస్తో మూడు చిత్రాలను లైన్లో పెట్టినట్లు రీసెంట్గానే అఫీషియల్గా ప్రకటించింది.