గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న తెలుగు హీరో..?

Pandrala Sravanthi
 ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో  ఎన్నో ఏళ్ల నుంచి సినిమాల్లో హీరోగా చేస్తున్న తగిన గుర్తింపు రాకుండా ఉన్న హీరోలలో నాగశౌర్య కూడా ఒకరు..  అలా పడుతూ లేస్తూ సినిమాలు చేస్తున్నారు.  అలాంటి ఈ హీరో "ఊహలు గుసగుసలాడే" అనే చిత్రం ద్వారా  తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి  మొదటి సినిమాతోనే హిట్ సాధించి యూత్ లో క్రేజ్ పెంచుకున్నాడు. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు నాగశౌర్య..అలాంటి ఈయన సినిమాల విషయం పక్కన పెడితే  2022 నవంబర్ 20న  అనుషా శెట్టి ని వివాహం చేసుకున్నారు. అయితే ఈమె బిజినెస్ లు చేయడంతో పాటు ఇంటీరియర్ డిజైనర్ గా పని చేస్తుంది. అలా వీరి వివాహం ముడిపడి రెండు సంవత్సరాలు దగ్గరికి వస్తున్న తరుణంలో తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు.

 త్వరలో ఈ దంపతులు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారని ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అయితే ఈ విషయం అధికారికంగా బయటకు రాలేదు కానీ, కేవలం తన దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ కు మాత్రమే తెలియజేశారట. దీనిపై తొందరలోనే నాగశౌర్య అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది..  మరి చూడాలి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియాలి అంటే నాగశౌర్య దంపతులు అఫీషియల్ గా  అనౌన్స్  చేసేవరకు వెయిట్ చేయాల్సిందే. 

ఇదిలా ఉండగా నాగశౌర్య అభిమానులు  ఈ వార్త విని కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నాగశౌర్య సినిమాల విషయం మాత్రం ఎక్కడ బయటకు రావడం లేదు. ఆయన తన పెళ్లి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ  కొన్ని బిజినెస్ లు చూసుకుంటూ  ఉంటున్నారని తెలుస్తోంది. ఇదే తరుణం లో  ఈయన మళ్ళీ సినిమాల్లోకి వచ్చి మంచి హిట్ సాధించాలని   అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: