తేజశ్వని మడివాడ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. బిగ్ బాస్ సీజన్ 2తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ ఓటీటీలో కూడా అడుగుపెట్టింది. కానీ రెండు సీజన్స్ లో మధ్యలోనే ఎలిమినేటై బయటకు వచ్చేసింది తేజు. త్వరలో ఆమె అర్థమయ్యింది అరుణ్ కుమార్ అనే వెబ్ సిరీ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ లో ఆమె మొదటిసారి బికినీ ధరించి కనిపించింది. దాని గురించి ప్రశ్నించారు ఓ రిపోర్టర్.దానికి సమాధానంగా ఆమె మాట్లాడుతూ ఆర్మీ, మేరీకోమ్ లాంటి సినిమాలకు మాత్రమే కష్టపడి బాడీ పెంచాలి అనుకుంటారు చాలా మంది. కానీ ప్రతి పాత్రకి బాడీ ఫిట్‌గా ఉండటం అవసరం. అప్పుడే స్క్రీన్‌లో బాగా కనిపిస్తాము. ఆ విషయంలో చిన్న యాక్టర్ నుంచి పెద్ద స్టార్స్ వరకు అందరూ కష్టపడతారు. నాకు మొదటి సారి అలంటి అవకాశం వచ్చింది. మనం ఏదైనా డ్రెస్ వేసుకుంటే బాగుంది అనిపించాలి, ఛీ ఇలా ఉందేంటి అనిపించకూడదు. నేను మొదటిసారి బికినీ వేసుకున్నాను. నేను అది గొప్ప అవకాశంలా భావిస్తున్నాను. అంత ఫిట్‌గా ఉన్నాను అంటే అది నా కష్టమని అర్థం. అయినా నేనేమి ఊరికే బికినీ వేసుకొని రోడ్ల మీద తిరగలేదు. సినిమాలో సన్నివేశం కోసం చేశాను. అంటూ చెప్పుకొచ్చింది తేజు. ఇదిలా ఉంటే బోల్డ్ గా కనిపించడం పై ఓ ఇంటర్వ్యూలో తేజస్వి ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఐదేళ్ల క్రితం నేను బికినీ వేసుకున్నా మాల్దీవ్స్ కు వెళ్ళినప్పుడు వేసుకున్న అని చెప్పుకొచ్చింది.
'అలాగే నాకు అలాంటి బాడీ ఉండటం, నేను బికినిలో అందంగా ఉండటంతో నన్ను నేను యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు నాకు 33 ఏళ్లు.. నా బాడీ నాకు నచ్చుతుంది. నేను ఫిట్ గా ఉన్నాను, అందంగా ఉన్నాను అందుకే ఇప్పుడు బికినీ వేసుకోవాలని అనుకున్నా.. ఆతర్వాత వేసుకుంటానో లేదో తెలియదు. ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. నేను ఇది వేసుకోవాలని వేసుకోలేదు నా సరదా కోసం బికినీ వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదు. ఓ షోలో ఓ హాట్ సీన్ లో అవసరం కాబట్టి చేశాను. నా పాత బాయ్ ఫ్రెండ్ కు నన్ను నమ్మాడు. ఇప్పుడు ఉన్న బాయ్ ఫ్రెండ్ నన్ను ఓ చిన్న పిల్లలా చూస్తాడు. అతను నన్ను బికినీలో చూసి షాక్ అయ్యాడు. ఇప్పుడు ప్రతి లో అబ్బాయిలు బాడీ చూపిస్తున్నారు. పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అందరూ షర్ట్స్ ఇప్పేస్తున్నారు. అదే నేను చేస్తే మాత్రం.. ఎదో చేసినట్టు ఫీల్ అవుతున్నారు. నేను కూడా జిమ్ కు వెళ్లి బాడీ డవలప్ చేశా.. ఇప్పుడు నేను బికినీలో కంఫర్టుబుల్ గా ఉన్నాను. కానీ ఇప్పటికీ బయటకు వెళ్తే బికీనీ బికినీ అంటున్నారు .. జీవితంలో నేను ఇంత ముందుకు వెళ్ళా మీరు ఇంకా బికినీ దగ్గరే ఉన్నారు ఏంట్రా అనిపిస్తుంది అని తేజస్వి మదివాడ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.