నటసింహం బాలయ్య క్వాలిఫికేషన్ వివరాలివే.. అక్కడ కూడా అదరగొట్టారుగా!
స్టార్ హీరో బాలకృష్ణకు రాజకీయాల్లో సైతం మంచి పేరు ఉంది. బాలయ్య సీనియర్ ఎన్టీఆర్ దంపతుల ఆరో కుమారుడు కాగా 14 సంవత్సరాల వయస్సులోనే తాతమ్మ కల సినిమాతో బాలయ్య సినీ ప్రయాణం మొదలైంది. స్టార్ హీరో బాలకృష్ణ నిజాం కాలేజ్ డిగ్రీ చదివారు. ఇంటర్ తర్వాతే నటుడు కావాలని బాలయ్య భావించినా కనీసం డిగ్రీ అయినా ఉండాలని ఎన్టీఆర్ కోరిక మేరకు బీఏ చదివారు.
కెరీర్ తొలినాళ్లలో తండ్రితో కలిసి సహాయ పాత్రల్లో బాలయ్య ఎక్కువగా నటించారు. సీనియర్ ఎన్టీఆర్ డైరెక్షన్ లో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాలో బాలయ్య నటించారు. బాలయ్య హీరోగా నటించిన తొలి సినిమా సాహసమే జీవితం కాగా కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో బాలయ్య ఏకంగా 11 సినిమాలలో నటించారు. ఈ సినిమాల్లో మెజారిటీ సినిమాలు సక్సెస్ అయ్యాయి.
కోడిరామకృష్ణ డైరెక్షన్ లో 7 సినిమాల్లో నటించిన బాలయ్య కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో 6 సినిమాల్లో నటించారు. సొంత పేరుతో బాలయ్య 7 సినిమాల్లో నటించడం గమనార్హం. బాలయ్య నటించిన ఏకైక జానపద చిత్రం భైరవ ద్వీపం అనే సంగతి తెలిసిందే. యమగోల చిత్రాన్ని బాలయ్యతో రీమేక్ చేయాలని భావించినా తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. బాలయ్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 35 కోట్లు అనే సంగతి తెలిసిందే. బాలయ్య తన సినీ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.