నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో అన్స్టాపబుల్లో అల్లు అర్జున్ పాల్గొని సందడి చేశారు.పుష్ప 2 ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ 4 షోలో పాల్గొన్నాడు. గతవారం తొలిపార్ట్ రిలీజ్ కాగా ఇప్పుడు నవంబర్ 22 ఇంటర్వ్యూలో రెండో పార్ట్‌ని ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్‌లో బన్నీ పిల్లలు అయాన్-అర్హ కూడా కాసేపు కనిపించారు. ఇక ఓ సందర్భంగా చిరంజీవి గురించి చర్చ రాగా అల్లు అర్జున్ డీటైల్డ్‌గా కొన్ని విషయాలు చెప్పాడు.అల్లు vs మెగా అనేది ఏమవుతుందనేది ఎవరికీ తెలీదు. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయమై ఇరువురు హీరోల ఫ్యాన్స్ విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.రీసెంట్‌గా పుష్ప 2ట్రైలర్ రిలీజ్ టైంలోనూ మెగా హీరోలు సైలెంట్‌గా ఉండటం హాట్ టాపిక్ అయింది. ఇలాంటి టైంలో చిరంజీవి గురించి అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.చిన్నప్పటినుంచి నాకు, చిరంజీవి గారితో రిలేషన్ ఎలా ఉండేదో అందరికీ తెలుసు. నాకు ఆయనంటే చాలా ఇష్టమనీ తెలుసు. కానీ, 20 ఏళ్ల వరకు నేను చిరంజీవి గారితో ఎలా ఉన్నానో ఎవరికీ తెలీదు. చిన్నప్పటినుంచి ఆయన్ని చూస్తూ పెరిగాను. ఒక హీరోగా కంటే ఒక వ్యక్తిగా ఆయనంటే అభిమానం. నా చిన్నప్పుడే మమ్మల్ని అందరినీ అమెరికాకు తీసుకెళ్లిన మొదటి వ్యక్తి చిరంజీవి గారే. ఆయన అనుకుంటే వాళ్ల కుటుంబం వరకే వెళ్లొచ్చు. కానీ, మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు. ఆ రోజుల్లో అంతమంది పిల్లల్ని తీసుకెళ్లడం అసాధ్యం. అలాంటిది ఆయన మమ్మల్ని తీసుకెళ్లారు. ఆయన్ని నేను చిక్ బాబాయ్ అంటాను. చిరంజీవి గారు మా తాతయ్య రామలింగయ్య గారికి చాలా గౌరవమిస్తారు. ఒక్కోసారి మా నాన్న కూడా ఇవ్వనంత గౌరవం ఇస్తారు.ఇలా చిరంజీవి గురించి బన్నీ ఇంతలా చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మరి అభిమానులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది పక్కనబెడితే ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.