మహేష్ బాబు: డిగ్రీ చదివాడు.. కానీ ఒక్క ముక్క తెలుగు రాదు ?

Veldandi Saikiran
టాలీవుడ్ హీరోలు చాలావరకు గొప్ప గొప్ప చదువులు చదువుతారు. ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం సినిమాలోకి వస్తారు. మరికొందరు మాత్రం చదువును మధ్యలోనే ఆపివేసి హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయమై మంచి సక్సెస్ సాధించారు. వారసత్వం పునికి పుచ్చుకొని చదువు కూడా పూర్తి చేయకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోలుగా ఎదిగారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఏం చదువుకున్నాడు అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

మహేష్ హానర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ పూర్తి చేశాడు. లయోలా కాలేజ్, చెన్నైలో మహేష్ బాబు హానర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. మహేష్ బాబు చదువు మొత్తం చెన్నై లోనే జరిగింది. ఇతనికి తెలుగులో చదవడం రాదు. కానీ అనర్గళంగా తెలుగులో మాట్లాడతాడు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. ఇక మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

చిన్న వయసులోనే ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన మహేష్ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని కెరీర్ లో మంచి గుర్తింపు అందించిన చిత్రం పోకిరి అని చెప్పవచ్చు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలైన తక్కువ సమయంలోనే భారీగా వసూళ్లను రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ కొత్త ట్రెండ్ ను సృష్టించింది. మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశాడు. కానీ పోకిరి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమా నుంచి మహేష్ బాబు కెరీర్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది.

ఇక ఎన్నో సినిమాలలో నటించిన మహేష్ బాబు ఆస్తుల విలువ వేలకోట్ల రూపాయలకు చేరుకుంది. జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కలిగి ఉండడమే కాకుండా హైదరాబాద్ గచ్చిబౌలిలో సెవెన్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏఎంబి సినిమాస్ మహేష్ బాబుది కావడం విశేషం. ఏపీ, తెలంగాణలో రెండు గ్రామాలను మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. రెయిన్ బో ఆసుపత్రులకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: