నటుడు సుమన్ భార్య తెలుసా.. ఈమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే షాకే?

praveen
కన్నడ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన సుమన్ కొంతకాలానికే టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అనతి కాలంలోనే తెలుగు సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆరు అడుగుల ఎత్తు, అందమైన ముఖం కలిగిన ఈ నటుడు, తన అభినయంతో అమ్మాయిల మనసు దోచుకున్నారు. హీరో, విలన్ లేదా సహాయ పాత్ర ఏదైనా అద్భుతంగా పోషించే కళ ఈయనకు ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో సుమారు 150 సినిమాల్లో నటించారు. కొన్ని కారణాల వల్ల కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, తన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా అన్నమయ్య సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామిగా, రామదాసు సినిమాలో శ్రీరామచంద్రుడిగా చేసిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
80ల దశకంలో తెలుగు సినీ పరిశ్రమలో సుమన్ ఒక అగ్ర తారగా వెలిగారు. చిరంజీవితో పోటీ పడేంతటి ప్రజాదరణను సంపాదించుకున్నారు. యాక్షన్ సినిమాలతో పాటు కుటుంబ కథా చిత్రాలలో కూడా ఆయన నటనకు మంచి ఆదరణ లభించింది. తరంగిణి సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన సుమన్ తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. కానీ, సుమన్ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగింది. బ్లూ ఫిలిమ్స్ తీస్తున్నారనే ఆరోపణలతో ఆయనను జైలుకు పంపించారు. తనపై రాజకీయ కుట్ర జరిగిందని ఆయనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రెండేళ్ళు జైలులో గడిపిన సుమన్ ఆ కాలంలో మానసికంగా చాలా కష్టపడ్డారు. అయితే, ఆయనపై ఉన్న అన్ని ఆరోపణల నుంచి తొలగించబడ్డారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సుమన్ జీవితం మరో మలుపు తిరిగింది. ప్రముఖ రచయిత బసవరాజు మనవరాలు శిరీషను పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం సినీ వర్గాల్లో చాలా చర్చనీయాంశమైంది. బసవరాజు సుమన్ నిర్దోషి అని నమ్మి తన మనవరాలు నిచ్చి పెళ్లి చేశారు. వివాహం తర్వాత సుమన్ తన సినీ జీవితాన్ని మరోసారి ప్రారంభించి బావ బావ మరిది, మొండి మొగుడు పెంకీ పెళ్ళాం, పెద్దింటి అల్లుడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇంటర్వ్యూలలో సుమన్ తన భార్యే తనకు సినీ రంగంలో మళ్లీ గౌరవం తెచ్చిపెట్టిందని, తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: