అక్కడ ప్రభాస్ నే పాతాళానికి తొక్కేసిన టాలీవుడ్ హీరో.. క్రేజ్ అంటే ఇదే కదా..!
ఇక ప్రభాస్ ఇండియాలోనే కాకుండా బాహుబలి సినిమాల కారణంగా ఇతర దేశాల్లో కూడా మంచి అభిమానులు ఉన్నారు. మరి ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో ప్రభాస్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే జపాన్ చైనా లాంటి దేశాల్లో ప్రభాస్ క్రేజ్ ఇప్పటికీ గట్టిగానే ఉంది. ప్రభాస్ ను చూడడం కోసం చాలా మంది ఇండియాకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రభాస్ ఇంటిదగ్గర ఎప్పటికప్పుడు జపాన్ ఫ్యాన్స్ సందడి చేస్తూనే ఉంటారు. అయితే ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి చాలా మంది పాన్ ఇండియ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.. వారికి కూడా ఇతర దేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అయితే ప్రత్యేకంగా జపాన్ లో మాత్రం ప్రభాస్ కంటే అత్యధిక క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరో మరొకరు ఉన్నారు. ఈ విషయం చాలా మందికి పెద్దగా తెలియదు ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు.
త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్.. ఇంతకు ముందు నుంచి ఆయన సినిమాలు జపాన్లో రిలీజ్ అయ్యేవట. అక్కడ ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా మంచి విజయాలు అందుకున్నాయి .. జపాన్లో రజినీకాంత్ లాంటి స్టార్ హీరోకి సైతం జూనియర్ ఎన్టీఆర్ పోటీ ఇచ్చాడు అంటే తెలుగు హీరో సత్తా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు .. ఇప్పటికీ అదే స్పీడ్ తో ఎన్టీఆర్ దూసకుపోతున్నారు . ఎన్టీఆర్ - ప్రభాస్ ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా వెలుగొందడం ఇతర దేశాల్లో కూడా వీళ్ళ సినిమాలకు మంచి డిమాండ్ ఉండడం అనేది ఒక వంతుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడడానికి కూడా కారణం అవుతుందనే చెప్పాలి …