"నా కొడుకు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు".. నాగచైతన్య పెళ్లి పై నాగార్జున సంచలన కామెంట్స్..!
ఫర్ ద ఫస్ట్ టైం ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో నాగచైతన్య పెళ్లి పై స్పందించారు . నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్ధం ఫోటోలు షేర్ చేసిన తర్వాత నాగార్జున ఎక్కడ కూడా వీళ్ళ పెళ్లికి సంబంధించి అసలు మాట్లాడలేదు . రీసెంట్గా ఐఫా అవార్డ్స్ జరిగాయి . అక్కడకు వెళ్లిన నాగార్జున ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలోనే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి విషయాలు బయట పెట్టారు .
"అన్నపూర్ణ స్టూడియోస్ లోనే పెళ్లి జరగబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు". అంతేకాదు "అసలు వీళ్ళు నాకు పెళ్లి పనులు అప్పగించలేదని.. మొత్తం పెళ్లి పనులు మేమే చూసుకుంటామని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ళ ఇద్దరు పెళ్లి బాధ్యతలను తీసుకున్నారు" అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు . అంతేకాదు నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ళ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాం "అంటూ కూడా చెప్పుకువచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు మొదటి నుంచి నాగ చైతన్య అంటే ఇష్టం గల నాగార్జున ..ఆయన లైఫ్ లో సెటిల్ అయితే చూడాలి అంటూ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే నాగచైతన్య లైఫ్ లో సెటిల్ కాబోతూ ఉండడంతో నాగార్జున ఫుల్ ఖుషి గా కూడా ఉన్నాడు..!