"నాలుగు నెలల ముందే నిశ్చితార్ధం" .. ఒక్కొక్కటిగా బయటపడుతున్న కీర్తి సురేష్ మ్యారేజ్ సీక్రేట్స్..!

Thota Jaya Madhuri
కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి ఇప్పుడు రకరకాల వార్తలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . మరి ముఖ్యంగా మహానటి సినిమా తర్వాత ఆమె ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. మహానటి సావిత్రి గారి బయోపిక్ లో నటించి మహానటిగా పాపులారిటీ సంపాదించుకుంది . ఒకప్పుడు మహానటి అనగానే అందరికీ సావిత్రి గారి గుర్తొచ్చేవారు అన్న విషయం మనకు బాగా తెలుసు. ఆమెను ఢీ కొట్టే వాళ్లే లేరు.


అయితే ఇప్పుడు ఈ జనరేషన్ కి మహానటి అనగానే అందరూ ముందుక మహానటి అంటూ కీర్తి సురేష్ పేరుని జపిస్తున్నారు. అలాంటి ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . మహానటి సినిమాలో నటించిన ఈమె ఎకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది . ఆ మూమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేము అంటూ తల్లి కూడా చాలా సందర్భాలలో ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు . అయితే కీర్తి సురేష్ త్వరలోనే తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టీల్ ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .


కీర్తి సురేష్ తండ్రి కూడా అఫీషియల్గా ఆ విషయాన్ని కన్ఫామ్ చేసేసాడు.  డిసెంబర్ 12వ తేదీ గోవాలోని ప్రైవేట్ రిసార్ట్ లో వీళ్ళపెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరగబోతుందట . అయితే కేవలం కుటుంబ సభ్యుల మాత్రమే ఈ పెళ్లికి హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది . కాగా వీళ్ళ నిశ్చితార్థం ఆగస్టు 14వ తేదీ న జరిగిందట . అయితే ఆ విషయాన్ని బయట పెట్టలేదు కీర్తి సురేష్ . ఆమెకు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా కమిట్ అయిన సినిమాల ఆలోచనలో పెట్టుకొని కీర్తి సురేష్ నే ఈ విషయాని బయట పెట్టలేదట.  ఫైనల్లీ పెళ్లి విషయాని కూడా బయటపెట్టాలి అనుకోలేదట.  కానీ అది ఎలాగలో మీడియాలో లీకై  పెద్ద రాద్ధాంతంగా మారిపోతున్నా మూమెంట్లో కీర్తి సురేష్ తండ్రి అఫీషియల్ గా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు అభిమానులు . కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటే సినిమాలో నటిస్తుందా..? లేదా..?  అనేది ఇప్పటికి ప్రశ్నార్థకంగానే ఉంది..!??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: