మహానటి: ఏకంగా నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో సత్తా చాటిన బయోపిక్ మూవీ.!

FARMANULLA SHAIK
ఒకప్పుడు నేషనల్ అవార్డుల ప్రకటన జరిగినపుడు తెలుగు సినిమా ఎక్కడుందా అని వెతుక్కునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమాకు పెద్ద పీట వేస్తున్నారు.ద‌క్షిణాది చ‌ల‌న చిత్ర‌సీమ‌ ఎంతో ఘనంగా జరుపుకునే సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ హంగు ఆర్భాటాలతో అట్టహాసంగా జరుగుతాయి.ఈ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ను జాతీయ అవార్డుల తరువాత రెండవ అత్యున్నత గౌరవంగా మన స్టార్స్ భావిస్తారు.ఈ నేపథ్యంలో 2018లో జరిగిన 66వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2018అవార్డ్స్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే తెలుగులో 2018 సంవత్సరానికిగానూ మ‌హాన‌టి ఫిల్మ్‌ఫేర్‌లో నాలుగు అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ చిత్ర పురస్కారంతో పాటు, ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ కి, ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కి మరియు బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ గా దుల్కర్ సల్మాన్ ఈ అవార్డులను గెలుచుకున్నారు. ఇప్పటికే మహానటి తెలుగు పరిశ్రమకు గర్వకారణంగా మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే.ఇదిలావుండగా తన అందం, అభినయం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చే రూపం నాటికి నేటికి సావిత్రిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సిరివెన్నెల అన్నట్టు ఆమె నటనలో ఎవరెస్ట్. అందుకే సావిత్రితో పోలికకైనా చాలా మంది వెనకాడుతుంటారు. అలాంటిది కీర్తి సురేష్‌ను సావిత్రి పాత్రలో చూపిస్తూ  సావిత్రి వాస్తవ జీవితంలో కీలక ఘట్టాలను తెరకెక్కించే సాహసం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే సావిత్రిగా కీర్తి సురేష్ నటించింది అనటం కంటే జీవించింది అనటమే కరెక్ట్. సావిత్రి పాత్రకు వందశాతం న్యాయం చేసి శెభాష్ అనిపించుకుంది కీర్తి.జెమినీ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్‌,ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య,ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు, జర్నలిస్ట్ మధురవాణిగా సమంత, ఫోటోగ్రాఫర్ విజయ్ ఆంటోనీగా విజయ్ దేవకొండ,ఎస్వీఆర్‌గా మోహన్ బాబు సుశీలగా శాలినీ పాండే,మాలివికగా అలమేలు , కెవి రెడ్డిగా  క్రిష్కెవి చౌదరిగా ,రాజేంద్ర ప్రసాద్, ఆలూరి చక్రపాణిగా ప్రకాష్ రాజ్ తదితర భారీ తారాగణంతో ప్రేక్షకులు మహానటి చిత్రంతో కనులవిందు చేశారు. ఈ హిస్టారికల్ క్లాసికల్ మూవీని వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్న, ప్రియాంక దత్‌లు నిర్మించారు.ఇదిలావుండగా భారీ అంచనాల నడుమ విడుదలైన తొలి తెలుగు బయోపిక్ మూవీ మహానటి తిరుగులేని కలెక్షన్లతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. లాంగ్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా సరికొత్త రికార్డులు నమోదు చేసింది మహానటి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: