సీనియర్ విలన్ రామిరెడ్డి గుర్తున్నాడా.. ఆయన ఫ్యామిలీ ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉందా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే నటులు మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో విలనిజం అనే పేరుకి కొత్త అర్ధాన్ని నేర్పిన రామిరెడ్డి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అప్పట్లో తన విలనిజంతో రామిరెడ్డి ఎంతలా ప్రేక్షకులను భయపెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ తన మేనరిజమ్స్ తో సరికొత్త కోణాలు చూపించిన మహానటుడు ఆయన.

 కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన అంకుశం సినిమాలో ఇక రామిరెడ్డి పండించిన విలనిజం  గురించి అయితే ఎంత చెప్పుకున్న తక్కువే  ఇది రామిరెడ్డికి మొదటి పాత్ర అయినప్పటికీ బలమైన పాత్ర దొరకడంతో ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి హీరోని సైతం డామినేట్ చేసేసారు రామిరెడ్డి. ఇక ఆ తర్వాత ఆయనకు మంచి పేరు రావడంతో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయ్. అయితే కేవలం టాలీవుడ్ లోనే మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఆయన పేరు మారుమోగిపోయింది. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు ఆయన  

 ఇలా 2010 వరకు ఇండస్ట్రీలో ఆయన యాక్టివ్గా సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ 2011 వ సంవత్సరంలో అనారోగ్యం కారణంగా చివరికి కన్నుమూశారు రామిరెడ్డి   ఈయనకి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే రామిరెడ్డి ఇండస్ట్రీలో పెద్ద స్టార్ కావడంతో ఆయన వారసులుగా కొడుకులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారని బాగా రాణిస్తారని అందరూ అనుకున్నారు. కానీ వాళ్లు మాత్రం ఇండస్ట్రీకి దూరంగానే పెరిగారు. ప్రస్తుతం రామిరెడ్డి ఇద్దరు కొడుకులు కూడా హైదరాబాదులో పలు స్వీట్ షాప్స్ నడుపుతున్నట్లు తెలుస్తోంది  అయితే వ్యాపారం బాగానే కొనసాగుతుందట. కానీ రామిరెడ్డి లాంటి స్టార్ కొడుకులు అయ్యుండి ఇలాంటి సాదాసీదా జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఈ విషయం తెలిసి ఎంతో మంది రామిరెడ్డి అభిమానులు కూడా బాధపడిపోతూ ఉంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: