టాలీవుడ్ లోని ఈ సీనియర్ హీరోలలో.. టాప్ రెమ్యూనరేషన్ ఎవరికో తెలుసా?

praveen
సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నటసింహం బాలకృష్ణ. ఎన్టీఆర్ ఏఎన్నార్ల తర్వాత ఈ నలుగురు హీరోలు కూడా ఇండస్ట్రీ బాధ్యతలను భుజాన వేసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే విధంగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు ఈ సీనియర్ హీరోలు.

 హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇక ఎన్నో డిఫరెంట్ కథలతో ప్రేక్షకులు ముందుకు వస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ లాంటి షో హోస్టింగ్ చేస్తున్నాడు. ఇంకోవైపు బాలయ్య సినిమాలతో దూసుకుపోతూనే.. అన్ స్టాపబుల్ అంటూ మరో టాక్ షోతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఇంకోవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక విక్టరీ వెంకటేష్ అటు మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూనే.. ఇంకోవైపు సోలో మూవీస్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

 అయితే సినిమా ఇండస్ట్రీలో ఈ నలుగురు కూడా సీనియర్ స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ నలుగురిలో ప్రస్తుతం టాప్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరో ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా ఒక్కో సినిమాకి 15 నుంచి 25 కోట్ల మధ్య పారితోషకం అందుకుంటున్నారు. ఈ నలుగురు ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకి 40 కోట్ల వరకు పారితోషకాన్ని అందుకుంటున్నారట. ప్రస్తుతం విశ్వంభర కోసం ఏకంగా 50 కోట్లు తీసుకుంటున్నారట ఆయన. ఇక నాగార్జున ఒక్కో సినిమా కోసం పది కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట. విక్టరీ వెంకటేష్ 10 నుంచి 15 కోట్లు తీసుకుంటున్నాడట. ఇక నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉండడంతో ఒక్కో సినిమాకి 25 కోట్లు తీసుకుంటున్నాడట. అంతేకాకుండా అన్ స్టాపబుల్ షో ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నాడట. ఇంకోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రస్తుతం ఈ నలుగురు సీనియర్ స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాకి 50 కోట్లు తీసుకుంటూ అందరికంటే టాప్ లో ఉన్నాడు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: