శంకర్‌కు చుక్కలు చూపించి .. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను వదులుకున్న స్టార్ హీరో..!

Amruth kumar
సౌత్ స్టార్ దర్శకుడు శంకర్ ఆలోచన ఎప్పుడు ఎవరు ఊహించిన రీతిలో ఉంటుంది .. అందుకే 15 సంవత్సరాలకు ముందే గ్రాఫిక్స్ వి ఎఫ్ ఎక్స్ తో మ్యాజిక్ చేశారు . 2010 లో రోబో సినిమాని అత్యుత్తమ హై క్వాలిటీ VFX తో తెరకెక్కించారు . ఇక అప్పట్లో చిత్ర పరిశ్రమ లో అందుబాటులో ఉన్న కొత్త టెక్నాలజీని హాలీవుడ్ టెక్నాలజీని కూడా ఈ సినిమా కోసం వాడారు . అలాగే ఆ రోజుల్లోనే ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగా బడ్జెట్ను పెట్టారు . ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే నిజానికి ఈ సినిమాల్లో హీరోగా నటించాల్సింది సూపర్ స్టార్ రజినీకాంత్ కాదట బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అట.

ముందుగా షారుక్ ఖాన్ కి కూడా రోబో కథ నచ్చడం తో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారట . అలాగే ఈ సినిమాను తానే నిర్మిస్తానని కూడా ముందుకు వచ్చారట. అలాగే అందుకు తగ్గట్టే షారుక్ ఖాన్ ఆఫీసులో అప్పట్లో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు . అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా  అప్పటి స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా డేట్స్ కూడా తీసుకున్నారు .

అయితే ఆ తర్వాత షారుక్ ఖాన్ సడన్గా ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది .. అందుకు కారణం శంకర్ కు తన మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలు అని ఓ ఇంటర్వ్యూలు చెప్పారు .. అయితే ఆ మాటలు మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . చిన్న మనస్పర్ధలు కారణంగా షారుక్ ఖాన్ భారీ ఇండస్ట్రీ హిట్ సినిమా ని చేతులారా వదులుకున్నారు . ఆ తర్వాత రోబో సినిమాని శంకర్ , రజనీకాంత్ తో చేసి ఆయనకు తిరుగులేని ఓ మెమొరబుల్ సినిమాని ఇచ్చారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: