తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత కూడా ఈ ముద్దు గుమ్మ ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ వెళ్లడం , అందులో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈమె కెరియర్ చాలా సంవత్సరాల పాటు సూపర్ జోష్లో ముందుకు సాగింది. ఇకపోతే ఈమె కెరియర్ అద్భుతమైన జోష్లో ముందుకు సాగుతున్న సమయంలోనే ఈమె గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇక పెళ్లి తర్వాత కూడా ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఆలా సినిమాల్లో నటిస్తున్న సమయం లోనే ఈమె గర్భవతి కావడంతో కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ఈమె వరస పెట్టి సినిమాల్లో నటిస్తుంది. కొంత కాలం క్రితం ఈమె బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆఖరుగా కాజల్ "సత్యభామ" అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కోసం ఈమె భారీ ఎత్తున ప్రచారాలను కూడా చేసింది. ఇక ఈ సినిమాతో కాజల్ మంచి విజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది భావించారు.
కానీ ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత ఈమె ఇప్పటివరకు ఏ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక చాలా మంది ఈమె ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలి అనే ఉద్దేశంతో మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నట్టుంది , అందుకే తన నెక్స్ట్ మూవీ ని స్టార్ట్ చేయడం లేదు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.