దుబాయ్ కి భర్త..ప్రియుడితో పూర్ణ అరాచకం..?
అనంతరం రవిబాబు దర్శకత్వంలో తనకెక్కిన అవును సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. రీసెంట్ గా నాని నటించిన దసరా సినిమాలోను అదరగొట్టింది. పూర్ణకు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడింది. అందులో భాగంగా సిల్లీ ఫెలోస్, దృశ్యం, అఖండ వంటి సినిమాలలో నటించింది. టాలీవుడ్ హాట్ బ్యూటీ పూర్ణ ఓ వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు స్మాల్ స్క్రీన్ పై జడ్జిగా కూడా వ్యవహరిస్తుంటారు.
కొన్ని రోజుల క్రితం శానిద్ ఆసిఫ్ ఆలీ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ బాబు కూడా జన్మించాడు. అయితే పూర్ణ గురించి లేటెస్ట్ గా ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. అదేంటంటే టాలీవుడ్ హాట్ బ్యూటీ పూర్ణ పెళ్లయిన తర్వాత కూడా మరో వ్యక్తితో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తుందని టాక్ వినిపిస్తోంది.
తన భర్త దుబాయ్ కి వెళ్ళిన సమయంలో ఆ వ్యక్తిని ఇంటికి పిలిపించుకోవడం చేస్తుందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయాన్ని పూర్ణ చుట్టుపక్కల ఉన్నవారు లీక్ చేశారంటూ సమాచారం అందుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ గతంలో కూడా పూర్ణాకు సంబంధించి చాలా రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై టాలీవుడ్ హాట్ బ్యూటీ పూర్ణ ఎలా స్పందిస్తుందో చూడాలి.