ఎన్టీ రామారావు ఫస్ట్ రెమ్మునరేషన్ ఎంతో తెలుసా?..ఎవరూ చేయని సాహసం చేశాడు..!

Veldandi Saikiran

నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు పరిచయమయ్యారు. ఎంతోమంది హీరోలుగా పరిచయమైనప్పటికీ నటసార్వభౌముడు నందమూరి తారక రామారావుని మించిన హీరో ఇప్పటివరకు లేరు. ఆయన ఒక లెజెండ్. తెలుగు సినిమా స్థాయిని మార్చేసిన నటుడు. తెలుగు సినిమాని, తెలుగు ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి. పౌరాణిక సినిమాలకు అతని కన్నా మంచిగా చేసేవారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు పాత్రలకు అతను బెస్ట్ అని చెప్పవచ్చు.

ఆయన కాకుండా ఆ పాత్రలు ఎవరు చేసినా అంతగా నిండుతనం రాదని చెప్పవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో అతనిది ఒక అపురూపమైన పాత్ర. 1951 లో విడుదలైన పాతాళభైరవి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకోవడంతో తెలుగు సినిమా స్థాయి మారిపోయింది.

అప్పట్లో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసిన తొలి సినిమాగా ప్రసిద్ధి చెందింది. కే.వి.రెడ్డి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్, ఎస్వీ రంగారావులు అద్భుతంగా నటించారు. కాగా ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ రెండేళ్లలో నాలుగు సినిమాలు చేయడానికి విజయ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఘంటసాల సంగీతం, మార్కస్ కెమెరామెన్ గా ఈ సినిమాకు ప్రాణం పోశారు. Sr NTR

1952 జనవరిలో గోవాలో జరిగిన భారత దేశపు తొలి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడిన సినిమా ఏకైక సౌత్ ఇండియన్ సినిమా పాతాళ భైరవి. కాగా, ఈ సినిమా లో Sr NTR  హీరోగా చేసినందుకు కేవలం రూ. 250 రూపాయలు మాత్రమే రెమ్యూ నరేషన్ తీసుకున్నారట. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా తన వంతు పాత్ర పోషించాడు. Sr ntr మొదటి సినిమా జీతంతో అప్పట్లో పేదవారికి భోజనం పెట్టించారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: