'రంగు పడుద్ది' అంటూ హిలేరియస్ గా నవ్వించిన ఏవిఎస్.. ఎలా మరణించారంటే..?

murali krishna
టాలీవుడ్ సినీ చరిత్రలో బ్రహ్మానందం తరువాత ఆ రేంజ్ కమెడియన్ గా ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం(ఏవిఎస్) గారు మంచి గుర్తింపు సాధించారు.తన అద్భుతమైన టాలెంట్ మిమిక్రితో ఆయన ప్రేక్షకులని ఎంతగానో అలరించేవారు..ఏవిఎస్ చదువుకుంటూనే నాటకాలలో నటించేవారు.నాటకాలలో నటించినా కూడా మిమిక్రి మాత్రం వదిలేవారు కాదు.ప్రతి రోజు ఎవరొకరిని అనుకరించేవారు.తన డిగ్రీ పూర్తి అయిన తరువాత ఎక్కువగా మిమిక్రి ప్రదర్శనలు ఇచ్చేవారు.ఆ ప్రదర్శనలలో ఎక్కువగా ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్ వాయిస్ లను అనుకరించే వారు..ఉదయం ,ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్ గా పని చేసారు.ఆ తరువాత సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నించారు.తనకు బాగా వచ్చిన మిమిక్రితో ఆకట్టుకోవడం ప్రారంభించారు.ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆయనకు అవకాశాలు రాలేదు.ఒకనాడు బాపు గారి వద్దకి వెళ్లిన ఏవిఎస్ తనకి ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని అడుగగా అప్పటికే చిరాకుగా వున్న బాపుగారు నీ మొహం అద్దంలో చూసుకున్నావా నువ్ ఆర్టిస్ట్ అవుతావా అని గట్టిగా అరిచేశారట.ఆ మాటలకు ఏవిఎస్ గారు ఎంతో కృంగిపోయారు.ఆ తరువాత మల్లి కొన్ని ప్రయత్నాలు చేసి మళ్ళీ ఆంద్రజ్యోతికి వచ్చేసారు.ఆ సంస్థ లో మెల్లగా సబ్ఎడిటర్ నుంచి ఇంచార్జ్ స్థాయికి ఆయన ఎదిగారు.కానీ ఆయనకీ సినిమాలలో నటించాలనే కోరిక అలానే ఉండిపోయింది.

ఒక రోజు బస్సు లో  నత్తిగా మాట్లాడే వ్యక్తి మిమిక్రి చేసిన ఏవిఎస్ ను చంద్ర సిద్దార్థ శర్మ గమనించారు.శర్మగారు ,ఏవిఎస్ గారు ఇద్దరు సహోద్యోగులు ..శర్మ గారికి బాపు ,రమణలతో మంచి పరిచయం వుంది.ఒకసారి ముళ్ళపూడి రమణ గారు విజయవాడ రావడంతో శర్మ గారు ఆయనకీ ఏవిఎస్ ని పరిచయం చేసారు.ఆయనకి ఏవిఎస్ గారు నత్తిగా మిమిక్రి చేసి చూపించారు.అది చూసాక ఆయన ఎంతగానో మెచ్చుకొని మీ విషయం బాపు గారికి చెబుతానని మాట ఇచ్చారు.బాపుగారికి రమణ గారు ఏవిఎస్ నత్తి కామెడీ గురించి వివరించగా సరే చూద్దాం అని అనేసారు.ఆ తరువాత బాపు గారు మిస్టర్ పెళ్ళాం సినిమాను తీసేందుకు సిద్ధం అయ్యారు.అందులో హీరోగా రాజేంద్రప్రసాద్ ,హీరోయిన్ గా ఆమని ఫిక్స్ అయ్యారు.మిగతా పాత్రలకు వారు ఆడిషన్ నిర్వహించారు.అందులో గోపాలకృష్ణ పాత్రకు రమణగారు ఏవిఎస్ ని తీసుకోవాలని బాపు గారికి చెప్పారు.రమణ గారి మాట కాదనలేక ఒకసారి ఆయన్ని ఆడిషన్ కి పిలవండని చెప్పారు..బాపు గారిని కలిసి ఆడిషన్ ఇచ్చిన ఏవిఎస్ గారు ఆ పాత్రకు సెలెక్ట్ అయ్యారు.ఆ విధంగా ఏవిఎస్ గారు నత్తి పాత్రతో మంచి గుర్తింపు సంపాదించారు..

పేరొచ్చినా కూడా ఆయన అవకాశాల కోసం ప్రయత్నాలు మానలేదు.తరువాత ఎస్వి కృష్ణా రెడ్డి గారు మాయలోడి సినిమాలో ఏవిఎస్ కి చిన్న పాత్ర ఇప్పించారు.ఆ చిత్రంతో ఎస్వి కృష్ణా రెడ్డి గారితో మంచి పరిచయం ఏర్పడింది.ఆ తరువాత సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మేడం సినిమాలో ఏవిఎస్ గారికి మంచి పాత్ర లభించింది.ఇలా వరుస అవకాశాలు అందుకున్న ఏవిఎస్ గారికి ఎస్వి కృష్ణా రెడ్డి గారు తన యమలీల సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు.ఆ తరువాత శుభలగ్నం సినిమాలో కూడా ఏవిఎస్ గారు క్వశ్చన్ బ్యాంకు మనిషి పాత్రలో అద్భుతంగా నటించారు.ఆ పాత్ర ఆయనకీ మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది.ఆ సినిమా ఏవిఎస్ గారి కెరీర్ ని మార్చేసింది.ఆ ఒక్క పాత్ర ఆయన్ని స్టార్ కమెడియన్ ను చేసింది.ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకున్న ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించారు.రంగు పడుద్ది అంటూ అద్భుతంగా అలరించిన  ఏవిఎస్ సుమారు 450 చిత్రాలలో నటించి మెప్పించారు.

సినిమాలలో కమెడియన్ గా ఎంతగానో అలరించిన ఏవిఎస్ తనని అంతగా ప్రోత్సహించిన వారిని ఎప్పుడూ మరువలేదు..తానూ పుట్టిన తెనాలి గొప్పతనాన్ని  ప్రపంచానికి సినిమా ద్వారా ఆయన తెలియ చేసారు.నిర్మాతగా ,దర్శకుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,హాస్య నటుడిగా ఆయన ఎంతగానో అలరించారు..ఆయన రాజకీయాలలో సైతం క్రియాశీలకంగా వ్యవహరించారు.టీడీపీ పార్టీ తరుపున ఎన్నో ప్రచార సభలను నిర్వహించారు.ఎన్నో అవార్డులు ,సన్మానాలు ఆయన పొందారు.ఏవిఎస్ గారికి ఇద్దరు పిల్లలు ఒక కూతురు ,ఒక కొడుకు ...ఆయనకి 2008 లో ఒక కిడ్నీ పని చేయలేదు దానితో ఆయన కుమార్తె ఒక కిడ్నీ తన  తండ్రికి దానం చేసింది.ఆ తరువాత కోలుకున్న ఆయన దూసుకెళ్తా సినిమాలో నటించారు.ఆ సినిమానే ఆయన చివరి చిత్రంగా నిలిచింది.ఆయనకీ  కాలేయ వ్యాధి ముదరడంతో 2013 నవంబర్ 8 న మరణించారు.ఆయన చనిపోయిన ఆయన చేసిన కామెడీ జ్ఞాపకాలు ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే వున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

AVS

సంబంధిత వార్తలు: