కళ్లుచిదంబరం: కళ్ళతోనే ఫేమసైనా కమెడియన్ చివరికి ఎలా చనిపోయారో తెలుసా.?

FARMANULLA SHAIK
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హాస్యనటులున్నారు. అందులో ఒక్కోకరిది ఒక్కో స్టైల్... తమ హావభావాలతో ప్రేక్షకుల మదిలో అలా గుర్తుండిపోతారు. అందులో కళ్ళు చిదంబరం ఒకరు.కళ్లు చిదంబరం అనగానే తెలుగు వారికి ఎన్నో సినిమాలు గుర్తుకు వస్తాయి. కమెడియన్‌గా కళ్లు చిదంబరం తెలుగు వారందరినీ ఎంతగానో నవ్వించాడు. అమ్మోరు లాంటి సినిమాలో ఎంతో సీరియస్‌గా కనిపించి కొన్ని చోట్ల భయపెడతాడు.కళ్ళు' అనే చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారాయన.. ఇదే ఆయనకి ఇంటి పేరు అయిపొయింది. గ్రేట్ సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, డి.విజయ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమాలో నటనకి గాను కళ్ళు చిదంబరంకి నంది అవార్డు కూడా లభించింది. కళ్ళు చిదంబరం అసలు పేరు కొల్లూరు చిదంబరం.ఆయన అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూనే, నాటకాలు వేస్తుండేవారు. అలా నాటకల నుంచి సినిమాల్లోకి వచ్చారు. తానూ ఉద్యోగం చేస్తున్న డబ్బును ఇంటి ఖర్చులకి వాడేవారు. ఇక సినిమాల ద్వారా వచ్చిన డబ్బును నాటక రంగానికి, సేవా కార్యక్రమాలకు, పర్యావరణ పరిరక్షణ కోసమే వినియోగించారు. ఎస్.వి కృష్ణారెడ్డి, ఇ.వి.వి సత్యనారాయణ, రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ గారి సినిమాల్లో కళ్ళు చిదంబరం ఎక్కువగా కనిపించేవారు. అలా దాదాపుగా 300లకు పైగా సినిమాల్లో నటించారు. 

ఆయన స్క్రీన్ మీద కనిపించేది కొంత సేపే అయినామంచి గుర్తుండి పోయే పాత్రలుఎన్నో చేసారు.ఆయన పండించే కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకుల ను కడుపుబ్బ నవ్వించాయి.ముఖ్యంగాకొన్ని సినిమాలోని పాత్రలు ఆయన కళ్ళ మీద రాసినవే.అంతేకాదు కొన్ని సినిమా లోని పాత్రాలకి తన కళ్ళని ఆధారంగా చేసుకొని రచయితలు డైలాగులురాసుకొని నటింపజేసేవారు.ఇలా తన మెల్ల కన్ను తోనే చాలా ఫేమస్ అయ్యాడు.ఇలా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన కళ్ళు చిదంబరం విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్య సమస్యలతో 2015లో తుదిశ్వాస విడిచారు.ఇదిలావుండగా కళ్ళు చిదంబరం కొడుకు తన మెల్లకన్ను పై ఆసక్తికర విషయాలు తెలిపారు.అయితే అది పుట్టుకతో వచ్చిన మెల్ల కన్ను కాదని విషయం కొందరికే తెలుసు.తాజాగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.నాన్న గారు ఆరో తరగతి నుంచి నాటకాలు తక్కువ వేసినా కూడా ఎక్కువగా అరేంజ్ చేసేవారు. పోర్టులో ఎంప్లాయ్‌గానే కాకుండా నాటకాలను ఎక్కువగా అరేంజ్ చేసేవారు.

అందరికీ పని కల్పించేవారు.నాటకాలు వేస్తూ వేస్తూ చాలా సేవలు చేసేవారు. ఆ సమయంలో సరిగ్గా తిండి లేక నిద్రలేకపోవడం వల్ల ఒక చిన్న నరం అలా పక్కకి జరగడంతో మెల్ల కన్ను వచ్చింది.దాన్ని సరి చేయోచ్చు అని డాక్టర్లు కూడా చెప్పారు. కానీ ఉద్యోగం, నాటకాలు ఇలా బిజీగా ఉండటంతో తరువాత చూద్దాం తరువాత చూద్దాం అని నిర్లక్ష్యం చేయడంతో మరింత ఎక్కువైంది. కళ్లు నాటకాన్ని చూసిన ఎంవీ రఘు కళ్లు సినిమాకు తీసుకున్నారు. ఒక్క సినిమా చేశాక మెల్ల కన్ను సరిచేద్దామని అనుకున్నారు. కానీ అదే కలిసి వచ్చిందని అలానే ఉంచేశారు.
ఒక్క సినిమా చేసి ఆపేద్దామని అనుకున్నారు. ఆ తరువాత ముద్దుల మావయ్య అనే సినిమా వచ్చింది. రెండో చిత్రం చేసేసి ఇక ఆపేద్దామని అనుకున్నారు. కానీ అలా వరుసగా సినిమాలు వచ్చాయి. డిపార్ట్మెంట్ వాళ్లు కూడా హెల్ప్ చేయడంతో సినిమాల్లోనే కంటిన్యూ అయిపోయారు అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: