ఐరన్ లెగ్ శాస్త్రి: "ఐరన్ లెగ్" అనే పేరే నిజ జీవితానికి శాపం.. రిక్షాలో అనాధ శవంగా.?

Pandrala Sravanthi
 గునుపూడి విశ్వనాథ శాస్త్రి..ఈ పేరు చెబితే ఎవరికి తెలియకపోవచ్చు.కానీ ఐరన్ లెగ్ శాస్త్రి అంటే అందరికీ ఇట్టే ఆయన కామెడీ మొహం గుర్తుకు వస్తుంది.. స్వతహాగా పురోహితుడైన ఐరన్ లెగ్ శాస్త్రి పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం లో జన్మించారు.ఈయన పురోహితుడు కావడంతో ఎన్నో పెళ్లిల్లలో పౌరహిత్యం చేస్తూ ఉండేవారు. అలా చేస్తున్న సమయంలోనే ఈయనకు సినిమాల్లో అవకాశం వచ్చింది.మరి సినిమాల్లోకి ఈయన్ని ఎవరు తీసుకోవచ్చారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
 ఐరన్ లెగ్ శాస్త్రి సినీ ఎంట్రీ:

 
 గునుపూడి విశ్వనాథ శాస్త్రి ఓ పెళ్లిలో పౌరహిత్యం చేసిన సమయంలో ఆ పెళ్లికి స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ వచ్చారట. అయితే పెళ్లికి వచ్చిన డైరెక్టర్ కి పౌరహిత్యం చేసే విశ్వనాథ శాస్త్రి కామెడీ టైమింగ్ నచ్చడంతో వెంటనే ఆయనకు నెంబర్ ఇచ్చి మీరు వెంటనే హైదరాబాద్ వచ్చేయండి మీకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారట. దాంతో వెంటనే హైదరాబాద్ వెళ్లారు. ఇక హైదరాబాద్ వెళ్ళిన మరుక్షణమే శాస్త్రికి కాల్ వచ్చింది. మీరు సినిమాలో చేయాలి అని..అలా అప్పుల అప్పారావు మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో గునుపూడి విశ్వనాథ శాస్త్రి కాస్తా ఐరన్ లెగ్ శాస్త్రిగా నామకరణం చేశారు ఇవివి సత్యనారాయణ. అప్పటినుండి ఈయన పేరు ఐరన్ లెగ్ శాస్త్రి గానే మారిపోయింది. ఇక అప్పుల అప్పారావు సినిమాలో స్టార్ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ స్టార్ కమెడియన్గా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం నటనకు ధీటుగా ఎలాంటి శిక్షణ తీసుకొని ఐరన్ లెగ్ శాస్త్రి చేశారు.

ఈ సినిమా విడుదలైన వారం రోజులకే  శాస్త్రి పేరు మార్మోగిపోయింది.ఆ తర్వాత ఐరన్ లెగ్ శాస్త్రీ పేరిట దాదాపు 150 సినిమాలు చేశారు.అయితే ఆ తర్వాత జనరేషన్ మారడంతో ఈయనకి అవకాశాలు తగ్గాయి. ఇక కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మళ్లీ పౌరహిత్యం మొదలుపెట్టారు. కానీ సినిమాలో చేసిన ఐరన్ లెగ్ క్యారెక్టర్ ఈయన నిజ జీవితానికి శాపంగా మారింది. దాంతో  ఇయన్నీ పెళ్లిళ్లకు ఫంక్షన్లకు పిలవకుండా ఐరన్ లెగ్ అని ముద్ర వేశారు.అలా సంపాదనలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వాన్ని ఇండస్ట్రీని సాయం అడిగారు.అయితే కొంతమంది సహాయం చేసినప్పటికీ అవి ఎటూ కాలేదు. దానికి తోడు ఆయన బరువు ఎక్కువగా ఉండడంతో గుండె జబ్బులు కామెర్ల వ్యాధితో ఇబ్బందులు పడ్డారు.

ఇక చివరికి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడంతో మరణించారు.ఇక ఈయన మరణించిన సమయంలో ఈయన శవాన్ని హాస్పిటల్ వాళ్ళు ఒక రిక్షాలో వేశారట. ఆ రిక్షాలో కాళ్లు, తలకాయ, చేతులు బయట కేవలం బాడీ మాత్రమే రిక్షా లోపల ఉందట.ఇక తన భర్త దీన స్థితిని చూసి ఐరన్ లెగ్ శాస్త్రి భార్య కన్నీళ్లు పెట్టుకుందట.అయితే ఈ విషయం మొత్తం చెప్పింది ఎవరో కాదు ఐరన్ లెగ్ శాస్త్రి కన్న కొడుకు ప్రసాద్ .. తండ్రి చనిపోయాక ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఇండస్ట్రీ నుండి సంపూర్ణేష్ బాబు, కాదాంబరి కిరణ్ లు తన చదువుకి సహాయం చేశారని ఐరన్ లెగ్ శాస్త్రి కొడుకు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.అలా కామెడీతో అందరినీ నవ్వించిన ఐరన్ లెగ్ శాస్త్రి తన చావుతో మాత్రం ఎంతోమందిని కన్నీళ్లు పెట్టించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: