తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో ఎస్తర్ నోరోన్హా ఒకరు. ఈ బ్యూటీ ఇప్పటివరకు తెలుగు , తమిళం , కన్నడ , మరాఠీ , కొంకణి , హిందీ భాషా సినిమాలలో నటించింది. ఇక ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమ ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఈ నటి 2013 వ సంవత్సరం విడుదల అయిన 1000 అబద్ధాలు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు గుర్తింపు కూడా పెద్దగా రాలేదు.
ఆ తర్వాత ఈ బ్యూటీ సునీల్ హీరోగా రూపొందిన భీమవరం బుల్లోడు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. అలా భీమవరం బుల్లోడు సినిమాతో మంచి గుర్తింపుని తెలుగు సినీ పరిశ్రమలో అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస పెట్టి అనేక తెలుగు సినిమాల్లో నటించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ వస్తుంది. సినిమా కెరియర్ను మొదలు పెట్టిన సమయంలో చాలా నాజుగ్గా ఉన్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో కాస్త బరువు ఎక్కువ అయింది.
ఇక బరువు ఎక్కువ అయినా ఈ బ్యూటీ తన అందాలను మాత్రం అద్భుతమైన స్థాయిలో మైంటైన్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ను ధరించి తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన రెడ్ కలర్ శారీలో నడుమందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.