అక్కినేని నాగచైతన్య బాటలోనే మరో తెలుగు హీరో..స్టార్ హీరోయిన్ తో పెళ్లి..ఎప్పుడంటే..?

Thota Jaya Madhuri
నాగచైతన్య అంతకుముందు ఈ హీరో పేరు బాగా హైలెట్ చేస్తూ జనాలు మాట్లాడుకునేవారు . కానీ ఇప్పుడు మాత్రం బూతులే తిడుతున్నారు . పచ్చిబూతులు ..అమ్మనా బూతులు తిడుతూ నాగచైతన్య పేరు ని ట్రోల్ చేస్తున్నారు . దానికి కారణం ప్రేమించి పెళ్లి చేసుకున్నా అమ్మాయికి విడాకులు ఇచ్చేసి  మరొక హీరోయిన్ ని ప్రేమించే పెళ్లి చేసుకోబోతూ ఉండడమే . డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ అంగరంగ వైభవంగా నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల మెడలో మూడుముళ్ల వేయబోతున్నారు . దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ సైతం నాగార్జున చేసేసారు.  కేవలం మరి కొద్ది రోజులే మరి కొద్ది రోజుల్లోనే నాగచైతన్య రెండో భార్యగా అక్కినేని కోడలిగా శోభిత ధూళిపాళ్ల అక్కినేని కాంపౌండ్ లో అడుగు పెట్టబోతుంది.

 
అయితే అక్కినేని నాగచైతన్య - సమంత లవ్ స్టోరీ మరొకసారి ట్రెండ్ అవుతుంది . ఇద్దరు "ఏం మాయ చేశావే" సినిమాలో కలిసిన నటించారు.  అదే మూమెంట్లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత చాలా సార్లు గుట్టు చప్పుడు కాకుండా బయట తిరిగారు.  ఆ విషయం మీడియాలో వైరల్ అయినా సరే పెద్దగా పట్టించుకోలేదు . సేమ్ టు సేమ్ ఇప్పుడు అదే విధంగా చేస్తుంది మరొక స్టార్ లవ్ బర్డ్స్.


విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా సైతం అదే విధంగా మీడియాలో ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నారు.  ఎప్పటికప్పుడు వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉంది అన్న వార్తలు వైరల్ అవుతున్నా మూమెంట్లో దానికి సంబంధించిన పిక్స్ కూడా ట్రెండ్ అవుతూ వచ్చాయి.  తాజాగా ఓ రెస్టారెంట్లో కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా  పిక్చర్స్ బాగా వైరల్ అవుతున్నాయి . అయితే గతంలో నాగచైతన్య - సమంత ఏ విధంగా అయితే తమ ప్రేమ వ్యవహారాన్ని దాచి  ఎంజాయ్ చేశారో.. సేమ్ టు సేమ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా  సైతం అదే విధంగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అని.. ఇండస్ట్రీ లో నెక్స్ట్ పెళ్లి పీటలు ఎక్కబోయే కపుల్ వీరే అంటూ బాగా ప్రచారం చేస్తున్నారు . చూడాలి మరి దీనిపై విజయ్ దేవరకొండ -రష్మిక మందన్నా ఎలా స్పందిస్తారో..???

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: