అందాల ముద్దు గుమ్మ కృతి సనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 1 నేనొక్కడినే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం అందుకున్న ఇందులో కృతి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగు లో మంచి క్రేజ్ వచ్చింది. అందులో భాగంగా ఈమె ఆ తర్వాత నాగ చైతన్య హీరో గా రూపొందిన దోచేయ్ అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది.
కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అక్కడ ఈమెకు మంచి అవకాశాలు దక్కడం , అలాగే ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు మంచి విజయను అందుకోవడంతో చాలా తక్కువ కాలం లోనే ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరస హిందీ సినిమాలతో ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు.
తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న మెరూన్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన బ్యాక్ అండ్ ఫ్రంట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.