సినిమా ఇండస్ట్రీ లో ఒకరితో అనుకున్న కథను మరొకరితో రూపొందించడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కొంత మంది సినిమా కథ నచ్చక మూవీలను రిజెక్ట్ చేస్తే ... కొంత మంది మాత్రం సినిమా కథ అద్భుతంగా నచ్చిన కూడా తన ఈమేజ్ కి ఆ కథ సెట్ కాదు అని వదిలేసిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ సినిమా కథ అద్భుతంగా నచ్చిన కూడా తన ఈమేజ్ వల్ల ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అనే కారణంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. అసలు ఆయన రిజెక్ట్ చేసిన సినిమా ఏది ... అది ఎలాంటి విజయాన్ని అందుకుంది అనేది తెలుసుకుందాం.
కొంత కాలం క్రితం సిద్ధార్థ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బొమ్మరిల్లు అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... బొమ్మరిల్లు సినిమా కథను భాస్కర్ మొదట నాకే వినిపించాడు. నాకు ఆ కథ సూపర్ గా నచ్చింది. కానీ ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు , భారీ డైలాగులు ఏమీ లేవు. ఇక నా సినిమాకు వచ్చేవారు ఎక్కువ శాతం వాటిని ఆశిస్తూ ఉంటారు. ఇక అలాంటివి ఆశించి ఆ సినిమాకు వచ్చి అవి అందులో లేనట్లయితే ప్రేక్షకులు డిసప్పాయింట్ అవుతారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక బొమ్మరిల్లు కథ నాకు అద్భుతంగా నచ్చిన నా వల్ల ఆ సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని చెప్పి నేను ఆ కథను రిజెక్ట్ చేసాను అని తారక్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.