ఆఖరి ఐదు సంవత్సరాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన తెలుగు సినిమాలు ఏవి .? అందులో ఏ సంవత్సరం సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.
2019 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన వినయ విధేయ రామ , నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన కథానాయకుడు , విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఎఫ్ 2 సినిమాలు విడుదల అయ్యాయి. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూడు సినిమాలలో వినయ విధేయ రామ , కథానాయకుడు సినిమాలు భారీ అపజయాలను అందుకోగా ఎఫ్ 2 సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
2020 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు , అల్లు అర్జున్ హీరోగా రూపొందిన అలా వైకుంఠపురంలో , కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఎంత మంచి వాడవురా సినిమాలు విడుదల అయ్యాయి. ఇకపోతే ఈ సంవత్సరం ఫైనల్ గా అలా వైకుంఠపురంలో సంక్రాంతి విన్నారుగా నిలిచింది.
2021 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రవితేజ హీరోగా రూపొందిన క్రాక్ , రామ్ పోతినేని హీరోగా రూపొందిన రెడ్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన అల్లుడు అదుర్స్ సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో క్రాక్ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
2022 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నాగార్జున హీరోగా రూపొందిన బంగార్రాజు , రౌడీ బాయ్స్ , హీరో సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో బంగార్రాజు మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య , బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి , సంతోష్ ఓపెన్ హీరో గారు రూపొందిన కళ్యాణం కమనీయం సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో ఆఖరుగా వాల్టేర్ వీరయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.