ధనుష్.. ఐశ్వర్య : పెద్దలను ఒప్పించి ప్రేమను గెలిపించుకున్నారు.. ఆ తర్వాతే ఏమైంది..?

Pulgam Srinivas
తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో ధనుష్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇక ఈయన నటించిన చాలా సినిమాలను తెలుగులో కూడా విడుదల చేయగా అందులో కొన్ని మూవీలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన సార్ అనే తెలుగు సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈయన కుబేర అనే మరో తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నాడు.

ఇకపోతే నటుడిగా అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన ధనుష్ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు అనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే ... ఈయన కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీ కాంత్ ఎంతో కాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో వారి పెద్దలను అంగీకారం కోసం సంప్రదించగా వారు కూడా వీరి పెళ్లికి అంగీకరించారు. దానితో 2004 వ సంవత్సరం నవంబర్ 18 వ తేదీన చెన్నై లో వీరు వివాహం చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక వయసులో ధనుష్ కంటే ఐశ్వర్య రెండు సంవత్సరాలు పెద్దది. ఇకపోతే 18 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా వీరి దాంపత్యం సాగింది.

కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ప్రస్తుతం ఎవరికి వారు జీవితాలను గడుపుతున్నారు. ఇక దీనితోనే అర్థం అవుతుంది. సినిమా రంగంలో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన ధనుష్ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆ స్థాయి సక్సెస్ను అందుకోలేదు అని. ఇకపోతే ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న కుబేర మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో ధనుష్ ఏ స్థాయి సక్సెస్ను అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: