తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో
టాలీవుడ్ కింగ్ అక్కినేని
నాగార్జున ఒకరు. ఈయన తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక స్టార్
హీరో అయినటువంటి నాగేశ్వరరావు నట వారసుడిగా
నాగార్జున వెండి తెరకు పరిచయం కావడంతో ఈయన మొదటి
సినిమా నుండి ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక నటించిన మొదటి
సినిమా నుండి నాగార్జునకు మంచి విజయాలు దక్కిన కూడా అదిరిపోయే సూపర్ సాలిడ్ విజయం మాత్రం
శివ మూవీతోనే దక్కింది.
శివ
మూవీ కంటే ముందు ఈయన నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కానీ ఇటు యూత్ లో ,
మాస్ లో
నాగార్జున కు అద్భుతమైన గుర్తింపును తెచ్చి పెట్టిన
సినిమా శివ.
శివ సినిమాతో ఒక్క సారిగా
నాగార్జున క్రేజ్ పెరిగిపోయింది. ఇకపోతే
శివ సినిమా కంటే ముందు
నాగార్జున కు అద్భుతమైన
లవర్ బాయ్ ఈమేజ్ ను తీసుకువచ్చిన సినిమాలలో
గీతాంజలి మూవీ ఒకటి. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో
నాగార్జున కు
లవర్ బాయ్ ఈమేజ్ లభించింది.