ఛీ ఛీ సినిమా ప్రమోషన్స్ కోసం అలాంటి పనా..? రష్మిక పై ఫ్యాన్స్ ఫైర్..!
మనకు తెలిసిందే రీసెంట్ గానే చెన్నైలో పుష్ప2 మ్యూజికల్ ఈవెంట్ జరిగింది. ఈ మ్యూజికల్ ఈవెంట్ లో పుష్ప2 ఐటమ్ సాంగ్ "కిస్సిక్" అనే పాటను రిలీజ్ చేశారు. శ్రీవల్లి క్యారెక్టర్ లో కనిపిస్తున్న రష్మిక మందన్నా.. హీరో అల్లు అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ పుష్ప మేకర్స్ ఈ సినిమా ఈవెంట్ కి హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఇదే మూమెంట్లో స్టేజి పైకి వచ్చిన రష్మిక మందన్నా స్పీచ్ ఇచ్చే ముందు హోస్ట్ లి రకరకాల ప్రశ్నలతో ఆమెను ఇబ్బంది పెట్టారు.
మరి ముఖ్యంగా మీరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు ..? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి నా..? లేకపోతే వేరే రంగానికి రిలేటేడ్ నా..? అంటూ అడగ్గా.. రష్మిక మందన్నా తనదైన స్టైల్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ.." ఆ విషయం అందరికీ తెలిసిందే మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా ..?" అన్న విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. దీంతో అక్కడుంటే జనాలు ఆడియన్స్ కూడా తప్పట్లు కొడుతూ .. విజిల్స్ వేస్తూ విజయ్ దేవరకొండ ..విజయ్ దేవరకొండ అంటూ కేకలతో అరుస్తారు .
శ్రీలీల సైతం ఎక్స్ప్రెషన్స్ ఓ రేంజ్ లో ఇచ్చింది. అయితే ఇప్పుడు దీనిపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. అఫ్కోర్స్ అది మీ పర్సనల్ మ్యాటర్ .. అలా స్టేజి పై బయట పెట్టాల్సిన అవసరం ఏముంది ..? మీ ఇద్దరి కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ ఇద్దరూ ఒకసారిగా ఈ విషయం రివీల్ చేస్తే బాగుండేదిగా..? ప్రమోషన్స్ కోసం ఇలాంటి పనులు కూడా చేస్తారా ..?అంటూ ఫైర్ అయిపోతున్నారు . మరొకపక్క రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ ని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేసింది అంటూ సంబరపడిపోతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు రష్మిక కి సంబంధించిన వార్తలు తెగ ట్రెండ్ అవుతున్నాయి..!