మొదటి భర్తకు విడాకులు.. రెండో భర్తకు దూరంగా..శ్రీజ జీవితం అల్లకల్లోలం ?
వీరికి కూతురు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం శ్రీజ కళ్యాణ్ నీ వివాహం చేసుకుంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి కూడా ఓ పాప జన్మించింది. అనంతరం మనస్పర్ధల కారణంగా వీరు కూడా వేరుగా ఉంటున్నారు. విడాకులు తీసుకున్నారంటూ జోరుగా ప్రచారాలు సాగుతున్నప్పటికీ ఈ విషయంపై ఇప్పటి వరకు శ్రీజ, కళ్యాణ్ స్పందించలేదు.
సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేశారు. దీంతో శ్రీజ, కళ్యాణ్ విడిపోయారని అందరూ అనుకుంటున్నారు. ఆ తర్వాత శ్రీజ మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుందని ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ప్రస్తుతం శ్రీజ తన ఇద్దరు పిల్లలతో తన తండ్రి చిరంజీవితో ఇంట్లోనే ఉంటుంది.
కాగా, కొన్ని రోజుల క్రితం శ్రీజ మొదటి భర్త భరద్వాజ్ అనారోగ్య కారణాలతో మరణించాడు. శ్రీజతో విడాకుల అనంతరం భరద్వాజ్ వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భరద్వాజ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే భరద్వాజ్ తో శ్రీజ విడాకులకు గల కారణం వరకట్నం వేధింపులే అని జోరుగా ప్రచారాలు సాగాయి. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని భరద్వాజ్ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. మరి శ్రీజ వేరే వివాహం చేసుకుంటుందా లేదా అలానే ఉండిపోతుందా అనేది తెలియాల్సి ఉంది.